ఐదేళ్లుగా ఆ అధ్లెట్ పై 60 మంది లైంగిక వేధింపులు
తాజాగా తాను ఎదుర్కొన్న అకృత్యాలను వెల్లడించింది. ఆమె మాటలతో స్పందించిన పోలీసులు ఇప్పటివరకు ఆమెపై లైంగిక వేధింపులకు గురి చేసిన 62 మంది అనుమానితుల్ని గుర్తించారు.
కేరళలో ఒక సంచలన అంశం వెలుగు చూసింది. విన్నంతనే ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. మరీ ఇంత దారుణమా? అన్న రీతిలో ఉన్న ఒక అకృత్యం బయటకు వచ్చింది. గడిచిన ఐదేళ్లలో దాదాపుగా 60 మంది పద్దెనిమిదేళ్ల క్రీడాకారిణిపై జరిపిన లైంగిక అకృత్యాల వైనం వెలుగు చూసింది. ఇటీవల శిశు సంక్షేమ కమిటీ నిర్వహించిన కౌన్సెలింగ్ లో ఆమె ఓపెన్ అయి.. తన ఆవేదనను పంచుకోవటంతో దారుణ ఉదంతాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పదమూడేళ్ల క్రితం బాధితురాలు తొలిసారి లైంగిక వేధింపులకు గురైనట్లుగా పేర్కొన్నారు. పొరుగింట్లో ఉన్న ఒక వ్యక్తి తనను కొండల్లోకి తీసుకెళ్లి.. స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడినట్లుగా పేర్కొంది. ఆ తర్వాత పలువురు కోచ్ లు.. తోటి ఆటగాళ్లు పలుమార్లు లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లుగా తెలిపింది.
ఇన్నాళ్లు భయంతోనే ఈ విషయాల్ని బయటపెట్టకుండా ఉన్న ఆమె.. తాజాగా తాను ఎదుర్కొన్న అకృత్యాలను వెల్లడించింది. ఆమె మాటలతో స్పందించిన పోలీసులు ఇప్పటివరకు ఆమెపై లైంగిక వేధింపులకు గురి చేసిన 62 మంది అనుమానితుల్ని గుర్తించారు.
వీరిలో 40 మందిపై పోక్సో.. ఎస్సీ.. ఎస్టీలపై దురాగతాల నిర్మాలన చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడా రాస్ట్రంలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఒక మైనరు బాలుడితో సహా పదిహేను మంది నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు కేరళలో పెను సంచలనంగా మారింది.