స్మిత్ - వార్న‌ర్ ల‌పై ఏడాది నిషేధం!

Update: 2018-03-28 13:14 GMT
ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా క్రికెట‌ర్ బెన్ క్రాఫ్ట్ ....బాల్ ట్యాంప‌రింగ్ కు పాల్ప‌డిన ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా, త‌న‌కు తెలిసే ట్యాంప‌రింగ్ జ‌రిగింద‌ని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నిస్సిగ్గుగా అంగీక‌రించ‌డం క్రీడా ప్ర‌పంచాన్ని షాక్ కు గురిచేసింది. ఆ జట్టు ఓపెన‌ర్ - వైస్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ...ఈ ట్యాంప‌రింగ్ వ్య‌వ‌హారంలో సూత్ర‌ధారి అని తేలింది. ఈ వ్య‌వ‌హారంపై ఆస్ట్రేలియా ప్ర‌ధాని తీవ్రంగా స్పందించారు. దేశం ప‌రువు తీసిన ఆ క్రికెట‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను ఆదేశించారు. దీంతో, హుటాహుటిన ద‌క్షిణాఫ్రికా చేరుకున్న సీఏ అధికారులు....ఆ ట్యాంప‌రింగ్ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపారు.

సీఏ - ఐసీసీల విచార‌ణ అనంత‌రం స్మిత్ - వార్న‌ర్ - బ్యాన్ క్రాఫ్ట్ ల‌పై నిషేధం విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. బాల్ ట్యాంప‌రింగ్ వ్య‌వ‌హారంలో  స్టీవ్ స్మిత్ - డేవిడ్ వార్నర్ లపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, స్మిత్ - వార్నర్ లు ఆస్ట్రేలియా జ‌ట్టుకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా నిషేధం విధించింది. యెల్లో టేప్ తో బాల్ ట్యాంప‌రింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కిన బ్యాన్ క్రాఫ్ట్ పై 9 నెలల నిషేధం విధించింది. క్రికెట్ ఆస్ట్రేలియా వారిపై సీరియ‌స్ గా స్పందించి క‌ఠినంగా శిక్షించింది. కేప్‌ టౌన్‌ లో విచారణ జరిపిన‌ క్రికెట్‌ ఆస్ట్రేలియా హెడ్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ లైన్‌ రాయ్ - హై ఫెర్ఫార్మెన్స్‌ మేనేజర్‌ పాట్‌ హోవార్డ్ లు ఇచ్చిన ప్రాథమిక నివేదిక అనంతరం సీఏ సీఈవో జేమ్స్‌ సదర్లాండ్ ఈ నిషేధం ప్ర‌క‌ట‌న చేశారు. అయితే, ట్యాంప‌రింగ్ వ్య‌వ‌హారంలో నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఐసీసీ ఆ ముగ్గురిపై చ‌ర్య‌లు తీసుకుంది. కావాలంటే, ఆ ముగ్గురు ఆటగాళ్లు సీఏ చ‌ర్య‌ల‌పై మరోసారి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా ఐసీసీ కల్పించింది. మ‌రోవైపు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ బాధ్య‌త‌ల‌నుంచి స్మిత్ ను ఆ జ‌ట్టు యాజ‌మాన్యం త‌ప్పించ‌గా - స‌న్ రైజ‌ర్స్ కెప్టెన్ వార్న‌ర్ ను ఆ జ‌ట్టు యాజ‌మాన్యం త‌ప్పించింది.




Tags:    

Similar News