క్రికెట్ కే మచ్చ..ఒసామా అంటూ కామెంట్

Update: 2018-09-16 10:35 GMT
అసీస్ క్రికెటర్ల జాతి వివక్ష మరోసారి బయటపడింది. ప్రపంచంలోనే అత్యంత క్రూరంగా విమర్శించే వ్యక్తులుగా ఆస్ట్రేలియా క్రికెటర్లకు పేరుంది. ఆ దేశంలో పర్యటించే అన్ని దేశాల క్రికెటర్లు అసీస్ క్రికెటర్ల మాటలకు నొచ్చుకునే వారే.. కొందరు అప్పటికప్పుడు స్పందిస్తే.. మరికొందరు ఆ అవమానాలను ఆత్మకథలో రాసుకుంటున్నారు. తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ తనకు ఆస్ట్రేలియా పర్యటనలో ఎదురైన అవమానాన్ని తన ఆత్మకథలో రాసుకొని బాధపడ్డాడు. ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది.

2015 యాషెస్ సిరీస్ సందర్భంగా  కార్డిఫ్ తొలి టెస్ట్  జరిగింది. ఈ తొలి టెస్ట్ లోనే మెయిన్ అలీ  అరంగేట్రం చేశాడు. అందులో 77 పరుగులు చేసి 5 వికెట్లు తీసి విశేషంగా రాణించాడట.. కానీ అదే సమయంలో మైదానంలో ఓ అసీస్ క్రికెటర్ మొయిన్ అలీని పట్టుకొని ‘టేక్ దట్ ఒసామా’ అని కామెంట్ చేశాడట.. దీనికి తీవ్రంగా నొచ్చుకున్న మొయిన్ అలీ ఆ టెస్ట్ అంతా సీరియస్ గా ఆడాడట.. ఇదే విషయాన్ని ఇంగ్లండ్ కోచ్  ట్రేవర్ బేలిస్ ద్వారా అసీస్ కోచ్ డారెన్ లీమన్ ను ప్రశ్నించారట.. అయితే లీమన్ ఆ ఆటగాడిని పిలిచి మాట్లాడినా తాను అలా అనలేదని తప్పించుకున్నాట..

ఈ పరిణామం తన జీవితంలోనే అత్యంత దురదుష్టకరమని మొయిన్ అలీ ఆత్మకథలో రాసుకొచ్చాడు. ఇప్పుడిదీ బయటకు రావడం.. అసీస్ క్రికెటర్లపై విమర్శలు రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా సంఘం స్పందించింది. ఆ క్రికెటర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తాజాగా స్పష్టం చేసింది.
Tags:    

Similar News