ఇండియన్ క్రికెట్ టీం అంటే దేశంలోని కోట్లాది మంది అభిమానుల ఆశల నౌక... ఆటగాళ్లయితే దేవుళ్లే... ఇది ఈ రోజు సంగతి కాదు... దశాబ్దాలుగా ఇండియాలో ఇదే పరిస్థితి... నవాబ్ పటౌడ - కపిల్ దేవ్ - రవిశాస్త్రి - గవాస్కర్ - సచిన్ - అజహర్ - ద్రవిడ్ - గంగూలీ - కుంబ్లే - శ్రీనాథ్ - జడేజా - కాంబ్లి.. ఇలా.. ఒకటా రెండా వందలమంది ఆటగాళ్లు అభిమానుల ప్రేమాభిమానాలను, కోపతాపాలను చూశారు. గెలిచినప్పుడు, గెలిపించినప్పుడు పొగడ్తల వర్షంలో నానియారు... ఓడినప్పుడు... విఫలమైనప్పుడు తిట్లవర్షంలో తడిసిపోయారు. ఇండియా టీం గెలుపోటములకు ఇంతవరకు ఆటగాళ్లదే బాధ్యతగా ఉండేది... ఒక్క క్రికెట్టే కాదు, ఒక్క ఇండియానే కాదు... ఏ ఆటయినా, ఏ దేశమైనా ప్రధానంగా ఆటగాళ్లదే బాధ్యత.. కానీ కొద్దికాలంగా మాత్రం ఇండియా క్రికెట్ టీం గెలుపోటములకు ఆటగాళ్లదు బాధ్యత కాదంటున్నారు అభిమానులు. వారి గర్ల్ ప్రెండ్సును ఈ గెలుపోటములకు బాధ్యులను చేస్తున్నారు.
అవును.. ఇటీవల కాలంలో ఇండియా గెలిచినా, ఓడినా అందుకు కెప్టెన్ కోహ్లీ గర్ల్ ప్రెండ్ అనుష్కనే బాధ్యురాలిగా చేస్తున్నారు. పాపం... ఈ విషయంలో ఆ అమ్మాయి కూడా చాలా బాధపడిపోతుంది. అసలు తనకు క్రికెట్ గురించి తెలియదని.. కోహ్లీతో కలిసి చూడడమంటే మాత్రం ఇష్టమని చెబుతోంది.
అయితే.. మొన్నమొన్న శ్రీలంకలో ఇండియా గెలవడానికి కారణమేంటన్న అంశంపై సోషల్ మీడియాలో అనేక కారణాలు చూపించారు. అందులో అధిక శాతం మంది మాత్రం ఆ మ్యాచులకు అనుష్క శర్మ వెళ్లకపోవడమే కారణమని తేల్చారు. దీంతో అనుష్య కాస్త బాధపడిందట.
కోహ్లీ కెప్టెను కాకముందు నుంచి అభిమానులు అనుష్కపై విరుచుకుపడుతున్నారు. ప్రపంచకప్ లో సెమీస్ లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో కోహ్లీ సింగిల్ రన్ కే అవుటయ్యాడు. ఆ మ్యాచ్ ను అనుష్క చూడడం వల్లే అలాజరిగిందని అప్పట్లో అభిమానులు ఆమెను నిందించారు. నిజానికి శ్రీలంకలో మన బౌలర్లు ఇరగదీశారు.... కానీ అభిమానులు మాత్రం ఆ క్రెడిట్ అనుష్కకు ఇచ్చేశారు. అయితే... తనపై ఇంతగా విమర్శలు వస్తున్నా కోహ్లీ మాత్రం వాటిని లైటుగా తీసుకోమంటూ అనుష్కకు ధైర్యం చెబుతున్నాడట. లేదంటే నేను ఎప్పుడో డిప్రెషన్ లోకి వెళ్లిపోయేదాన్ని అంటోంది ఈ అందాల బొమ్మ. ఇంకో విషయమేంటంటే కోహ్లీ తనను ఇష్టపడడంపై అనుష్క చాలా ఆశ్చర్యపోతోంది కూడా... కోహ్లీకి ముక్కు మీద కోపమని.. తనకు అసలు కోపమే రాదని.. ఇలా ఎన్నో వ్యత్యాసాలు తమ మధ్య ఉన్నాయని.. కోహ్లీ తనను ఎందుకు ఇష్టపడ్డాడో తెలియదని అంటోంది.
అభిమానుల నిందలు మాటకేమో కానీ.. క్రీజులో ఉన్నప్పుడు ఎదురుగా కత్తిలాంటి గర్ల్ ప్రెండు కనిపిస్తే కోహ్లీకే కాదు మనకైనా ఏమనిపిస్తుంది.. మరేం అందుకే కోహ్లీ కూడా అనుష్క వచ్చిన మ్యాచ్ ల్లో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాడు. ఆమె లేనప్పుడు మాత్రం ఇరగదీసి ఆడేస్తుంటాడు.... మనమూ సగటు అభిమానులమే కదా.. అందుకే ఈ అభిప్రాయం. ఏమనుకోకు అనుష్కా...!!