టీ20 ప్రపంచకప్: క్రికెటర్‌పై అత్యాచారం ఆరోపణలు

Update: 2022-11-07 00:30 GMT
సిడ్నీలో లైంగిక వేధింపుల ఆరోపణలపై శ్రీలంక క్రికెటర్  దనుష్క గుణతిలకను అరెస్టు చేశారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను అతను తన జట్టుతో కలిసి బస చేసిన హోటల్ కు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరచనున్నారు.

ధనుష్క దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 31 ఏళ్ల దనుష్క ఇప్పటికే  గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. అయితే ఆస్ట్రేలియాలో జట్టుతో కొనసాగాడు.

తన అనముతి లేకుండా లైంగిక సంపర్కానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  అతడిపై నాలుగు అభియోగాలు మోపినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు.  శనివారం స్టేట్ క్రైమ్ కమాండ్  సెక్స్ క్రైమ్స్ స్క్వాడ్ పోలీసుల దర్యాప్తు తర్వాత బుధవారం రోజ్ బేలోని తన నివాసంలో 29 ఏళ్ల మహిళ లైంగిక వేధింపులకు గురైనట్లు తేలింది.  

నివేదికల ప్రకారం ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా వీరిద్దరూ పరిచయం అయ్యారు. చాలా రోజుల చాటింగ్ తర్వాత అతనితో కమ్యూనికేట్ చేసిన ఆ మహిళ దనుష్కతో ఓ సందర్భంలో కలిసింది. తన ఫ్లాట్ కు వచ్చిన ధనుష్కతో మీట్ అయ్యింది. ధనుష్క నవంబర్ 2, 2022 సాయంత్రం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. అరెస్టు తర్వాత ధనుష్కను సిడ్నీ సిటీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సమ్మతి లేకుండా లైంగిక దాడికి సంబంధించి నాలుగు ఆరోపణలపై అభియోగాలు మోపారు. అతనికి కోర్టు బెయిల్ నిరాకరించింది.
Tags:    

Similar News