ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్ గిల్ ను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. కారులో తిప్పుతూ దారుణంగా కొట్టి, పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి చంపేస్తామని బెదిరించారట. సంచలనం సృష్టించిన ఈ ఘటన.. రెండు వారాల క్రితం సిడ్నీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటర్మైంట్ తీసుకున్న తర్వాత సిడ్నీలోని అరిస్టాటిల్స్ రెస్టారెంట్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడట మెక్ గిల్. ఆ రెస్టారెంట్ ఓనర్ చెల్లితో మెక్ గిల్ కు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారిందట. ఈ విషయం ఓనర్ తెలుసుకొని అతన్ని బెదిరించాలని నిర్ణయించుకున్నాడట.
ఈ మేరకు నలుగురు వ్యక్తులకు డబ్బులు ఇచ్చి, కిడ్నాప్ కు ప్లాన్ చేశాడట. ఈ క్రమంలో ఏప్రిల్ 14వ తేదీన రాత్రివేళ ఇంటికి వెళ్తున్న మెక్ గిల్ ను చుట్టుముట్టిన దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం కారులోనే రెండు గంటలపాటు నగరంలో తిప్పి, దారుణంగా కొట్టారట. ఆ తర్వాత శివారుకు తీసుకెళ్లి, చంపేస్తామని తుపాకీతో బెదిరించారట. ఆ తర్వాత అతన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు.
ఎలాగోలా ఇంటికి చేరుకున్న గిల్.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడట. రంగంలోకి దిగిన సిడ్నీ పోలీసులు.. నిందితులను గాలించి పట్టుకున్నారు. దీంతో.. అసలు విషయం తేలింది. సదరు రెస్టారెంట్ ఓనరే ఈ కిడ్నాప్ సూత్రధారి అని నిర్ధారించారట పోలీసులు.