ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ చేజారిన ఆగ్రహంలో అతడిని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. చాలా వివాదాల్లో కోహ్లీ కూరుకుపోయాడు. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా టీమిండియా కెప్టెన్ కోహ్లీకి చెందిన హోటల్ చైన్ తీసుకున్న నిర్ణయం స్వలింగ సంపర్కుల ఆగ్రహానికి కారణమైంది.
2018లోనే స్వలింగ సంపర్కులను సమాజం నుంచి బహిష్కరించడం ఐపీసీ 377 సెక్షన్ భారత రాజ్యాంగానికి విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు కోహ్లీ హోటల్ యాజమాన్యం స్వలింగ సంపర్కుల పట్ల వివక్ష ప్రదర్శించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పూణేలోని కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ అనే రెస్టారెంట్ స్వలింగ సంపర్కులకు ప్రవేశాన్ని నిరాకరించిందన్న ఆరోపణలపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. సమాజంలో అందరూ ఒక్కటేనని గతంలో సుప్రీంకోర్టు తెలిపిందని.. అయినప్పటికీ హోటల్ యాజమాన్యం వారి ప్రవేశాన్ని అడ్డుకోవడం హక్కులను ఉల్లంఘించడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇప్పటికే పలు రెస్టారెంట్లు స్వలింగ సంపర్కులను అవమానించడం పరిపాటిగా మారిందని.. దీనికి విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కూడా మినహాయింపు కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీకి చెందిన ఇతర రెస్టారెంట్ బ్రాంచ్ లలోనూ స్వలింగ సంపర్కులకు ప్రవేశంపై నిషేధాన్ని అమలు చేస్తున్నారని.. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా కోహ్లీని టార్గెట్ చేస్తూ పలు కామెంట్ చేస్తున్నారు. సమాజంలోని అందరినీ సమానంగా చూడాలని కోహ్లీకి హితవు పలుకుతున్నారు.
టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై ఓటమి అనంతరం విరాట్ పై విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు తాజా వివాదంతో అవి రెట్టింపు అయ్యాయి.