న‌వ‌త‌రం క్రికెట‌ర్ల‌తో బాలీవుడ్ బాండింగ్ ఇంత స్ర్టాంగ్!

Update: 2022-08-30 06:56 GMT
భార‌త క్రికెట‌ర్ల‌తో బాలీవుడ్ భామ‌ల‌ బాండింగ్ ఎంతో ప్రత్యేక‌మైన‌ది. కొంత మంది ప్రేమ డేటింగ్ వ‌ర‌కే ప‌రిమితంగా కాగా..మ‌రి కొంత మంది వివాహ బంధంతో ఒక‌టైన జంట‌లెన్నో ఉన్నాయి. క్రికెట‌ర్ల‌కి-హీరోయిన్ల‌కి మ‌ధ్య కుదిరినంత‌గా ఇత‌ర ఏ రంగంలోనూ అంత‌గా సెట్ అవ్వ‌లేద‌ని చెప్పొచ్చు. భార‌త్ లో క్రికెట్ కి ఉన్న ఆద‌ర‌ణ‌....బాలీవుడ్ భామ‌ల క్రేజ్ కొంత మందికి అలా క‌లిసొచ్చింది.

కొన్ని ద‌శాబ్ధాల గా  ఈ క‌ల్చ‌ర్ బాలీవుడ్ లో కొన‌సాగుతుంది. ఓ సారి న‌వ‌త‌రం జంట‌లపై ఓ లుక్ ఏస్తే...స్టార్ బ్యాట్స్ మ‌న్ విరాట్ కోహ్లీ- అనుష్క శ‌ర్మ జోడీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సెల‌బ్రిటీ క్రికెట్ జంట‌లో అజ‌రామ‌ర ప్రేమికులుగా ఇద్ద‌రికి మంచి స్థానం ఉంది.  ఇండియా టీమ్ కి కోహ్లీ ఎంట‌ర్ అవ్వ‌డం అటుపై ఓ యాడ్ లో అనుష్క తో క‌లిసి న‌టించ‌డం..అదే స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డ‌టం ఒకేసారి జ‌రిగింది.

అటుపై  పెళ్లి..వామిక జ‌న్మ‌నివ్వ‌డం అంతా వేగంగా జ‌రిగిపోయింది. పెళ్లి  త‌ర్వాత అనుష్క సినిమాల విష‌యంలో ఎంతో కేరింగ్ తీసుకుంటుంది. అలాగే లెగ్ స్పిన్స‌ర్ యజువేందర్ చాహల్ గతేడాది చివర్లో కోరియోగ్రాపర్.. యూట్యూబర్ ధనశ్రీ వర్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్య కొంత మంది బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో డేటింగ్ అనంత‌రం   విదేశీ డాన్స‌ర్  నటాసా స్టాంకోవిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ జంట‌కి ఓ బాబు కూడా  ఉన్నాడు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న లేదు.  న‌టాసా  సెర్బియా దేశస్థురాలు.  ఆమె ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.  ఇక టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ కె.ఎల్ రాహుల్- బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి డేటింగ్ లో ఉన్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారంలో ఉంది.

ఇద్ద‌రు మీడియాకి చిక్కిన సంద‌ర్భాలెన్నో. ఇంత‌వ‌ర‌కూ విష‌యాన్ని ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు గానీ..త్వ‌ర‌లో ఈ జంట వివాహ బంధంతో ఒక‌టి కాబోతున్న‌ట్లు స‌మాచారం. సునీల్ శెట్టి పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిన‌ట్లు మీడియా లో క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే యంగ్ ప్లేయ‌ర్ శుభ‌మాన్ గిల్- సారా అలీఖాన్ సైతం డేటింగ్ లో ఉన్న‌ట్లు నెట్టింట జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

సైఫ్ అలీఖాన్  డాట‌ర్ గా బాలీవుడ్ కి అడుగు పెట్టిన  సారా ఇప్పుడిప్పుడే కెరీర్ లో నిల‌దొక్కుకుంటుంది.  గ‌తంలో కార్తీక్ ఆర్య‌తో ప్రేమ‌లో ప‌డిన‌ట్లు ప్రచారం సాగింది. అది వీగిపోయిన త‌ర్వాత ఇండియ‌న్ ప్లేయ‌ర్ కి ద‌గ్గ‌రైన‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రు జంట‌గా దుబాయ్ లో డిన్న‌ర్ చేస్తున్న ఫోటోలు ఇటీవ‌ల  నెట్టింట వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News