నేరగాళ్ళను ఎన్నికల నుండి దూరం చేసేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నం చేస్తున్నది. ఈ విషయంలో రాజకీయ పార్టీలు చేతులు ఎత్తేసిన కారణంగా స్వయంగా సుప్రింకోర్టే బాధ్యతలను తీసుకున్నది. ఇందులో భాగంగానే తీవ్ర నేరారోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించవచ్చా ? అంటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తమ నోటీసులపై వెంటనే సమాధానం చెప్పాలని కేంద్ర న్యాయశాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది.
చట్టసభల్లో నేరస్తుల ప్రాతినిధ్యం పెరిగిపోతోందని దీని నూరుశాతం నిరోధించకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పని అందరు గోల పెడుతున్నదే. కానీ ఎన్నికలు వచ్చేసరికి అన్ని పార్టీల తరపున నేరగాళ్ళు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు పోటీ చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే జనాలు కూడా వీళ్ళల్లో కొందరికి ఓట్లేసి గెలిపిస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన 539 మంది ఎంపీల్లో 233 ఎంపీలపై నేరారోపణలున్నాయి.
ఒక ఎంపీ మీద ఏకంగా 204 క్రిమినల్ కేసులున్న విషయం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. హత్య, దోపిడీ, ఇంట్లోకి చొరబడటం, కిడ్నాపులు, వేధింపుల్లాంటి ఎన్ని కేసులున్నా పార్టీ టికెట్ ఇవ్వటం, జనాలు ఓట్లేసి గెలిపించటమే ఆశ్చర్యంగా ఉందని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది.
ఇక్కడ విషయం ఏమిటంటే పోటీ చేస్తున్న అభ్యర్ధులపై ఎన్ని కేసులుంటే గెలుపు అంత గ్యారెంటీ అని కొన్ని పార్టీలు అనుకుంటున్నాయట. అందుకనే కేసులున్నా పట్టించుకోకుండా టికెట్లిచ్చేస్తున్నాయి. మొన్నటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ తరపున పోటీ చేసిన ఇద్దరు నేరగాళ్ళు జైల్లో ఉండి నామినేషన్లు వేస్తే మంచి మెజారిటితో గెలిచారు.
అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇదే న్యాయస్థానం ఒకపుడు ఆరోపణలున్నంత మాత్రాన ఏ వ్యక్తీ ముద్దాయి కాడని తేల్చిచెప్పింది. ఆరోపణలు నిరూపితమై శిక్షపడితేనే సదరు వ్యక్తిని నేరస్తుడని అనచ్చని న్యాయస్ధానమే ఎన్నోసార్లు చెప్పింది.
కేవలం ఆరోపణలున్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీచేయటానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశంలేదు. ప్రత్యేక కోర్టులు పెట్టి విచారణ స్పీడుచేయాలి. ఏదేమైనా రాజకీయాల నుండి నేరస్తులను దూరంగా ఉంచాలనే సుప్రీంకోర్టు ప్రయత్నం మంచిదే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.