షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్న రిషిపై విమర్శలు

Update: 2022-11-01 04:12 GMT
అనూహ్య పరిస్థితుల్లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత మూలాలు ఉన్న రిషి సునాక్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గ్రేట్ బ్రిటన్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు షాకింగ్ గా మారుతున్నాయి.

పదవీలోకి వచ్చి రాగానే ఆయన.. భారత మూలాలు ఉన్న సుయోల్లా బ్రేవర్మన్ ను హోం సెక్రటరీగా తీసుకోవటంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత.. విమర్శలు రావటం తెలిసిందే. ఇవి ఒక కొలిక్కి రాక ముందే.. ఆయన మరో కీలక నిర్నయాన్ని తీసుకున్నారు.

ఈజిప్టు వేదికగా జరిగే పర్యావరణ సదస్సుకు పాల్గొనకూడదని నిర్ణయాన్ని తీసుకున్నారు. గతంలో జరిగిన పర్యావరణ సదస్సులకు ఆగ్ర దేశాల్లో ఒకటైన బ్రిటన్ కీలక భూమిక పోషించింది. గత ఏడాది గ్లాస్గోలో జరిగిన పర్యావరణ సదస్సుకు అప్పటి యూకే ప్రధానిగా వ్యవమరించిన బోరిస్ జాన్సన్ కీలక భూమిక పోషించారు.

అప్పట్లో ఆయన ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా వ్యవహరించిన రిషి.. తాజాగా దేశ ప్రధాని హోదాలో ఉంటూ.. ఈజిప్టులో జరిగే పర్యావరణ సదస్సుకు డుమ్మా  కొట్టటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జీజిస్టులో జరిగే సదస్సుకు బ్రిటన్ రాజు.. పర్యావరణ వేత్తగా పేరున్న ఛార్లెస్ 3 కూడా గైర్హాజరు అవుతున్నారు. తాజాగా బ్రిటన్ ప్రధానిగా వ్యవహరిస్తున్న రిషి సునాక్ సైతం హాజరు కాకూడదని నిర్ణయించుకోవటాన్ని తప్పు పడుతున్నారు.

పర్యావరణ సదస్సుకు గైర్హాజరు కావటం ద్వారా బ్రిటన్ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తుందా? అన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. యూకే తీరు ఆందోళన కలిగిస్తుందని పలు దేశాలు తప్పు పడుతున్నాయి. పదవీలోకి వచ్చీ రాగానే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని ఇప్పటికే ప్రకటించిన రిషి.. అందుకు తగ్గట్లే వ్యవహరించటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News