ఇటీవల ముగిసిన టీఆర్ఎస్ ఒక రోజు ప్లీనరీ సందర్భం గా తెలంగాణ అధికార పార్టీ తీరు పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తాయి. పార్టీ పెట్టి 20 ఏళ్ల నేపథ్యం లో ప్లీనరీ ని భారీ గా నిర్వహించటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఆ పేరు తో హైదరాబాద్ మహా నగరం మొత్తం చేసిన హడావుడి పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల కు విరుద్ధం గా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు.. ఆ చౌరస్తా.. ఈ చౌరస్తా అన్న తేడా లేకుండా అంతా గులాబీ మయం చేయటం.. ఇలాంటి వాటి పై చర్యలు తీసుకునే అధికార యంత్రాంగం చప్పుడు చేయకుండా ఉండిపోవటం పై సామాన్యులు.. రాజకీయ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయటానికి వీల్లేకుండా జీహెచ్ ఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి వేళ.. సైబరాబాద్ పోలీసుల తీరు ను తప్పు పడుతూ ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సాధారణం గా హైదరాబాద్ మహానగరంలో ఫ్లెక్సీలు.. బ్యానర్లు లాంటివి చట్ట విరుద్ధం. ఇలాంటివి ఏర్పాటు చేసిన వారి పై చర్యలు తీసుకోవటం.. అందు లో భాగంగా భారీ గా జరిమానా ను విధించటం లాంటివి చేస్తుంటారు. అందుకు భిన్నం గా తాజా వీడియో లో సైబరాబాద్ పోలీసులు ఏకంగా టీఆర్ఎస్ ప్లీనరీ కి సంబంధించిన ఫ్లెక్సీలను స్వయం గా ఏర్పాటు చేయిస్తుండటం.. నలుగురైదుగురు ట్రాఫిక్ పోలీసులు దగ్గరుండి మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తీరు ను తీవ్రం గా తప్పుపడుతున్నారు.
రోడ్డు మీద పోలీసు వాహనాన్ని నిలిపి.. దాని వెనుకనే మరో వాహనం లో ఫ్లెక్సీల్ని భారీ గా ఉంచి.. కొంత మంది ప్రైవేటు వ్యక్తుల చేత.. స్తంభాలకు ఫ్లెక్సీల ను కట్టిస్తున్న వైనాన్ని వీడియో తీసిన వారు సోషల్ మీడియా లో షేర్ చేశారు. ప్లీనరీకి దారి చూపించే ఫ్లెక్సీల ను పోలీసులు దగ్గరుండి ఎలా కట్టిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదే ఎవరైనా ప్రైవేటు వ్యక్తుల పనికి అయితే ఇలా చేస్తారా? పోలీసులు పోలీసు పని చేయాలే కానీ.. ఇలా అధికార పార్టీకి సేవ చేయాల్సిన అవసరం ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఒక వైపు జీహెచ్ఎంసీ అధికారులు నగరాన్ని గులాబీ మయం చేసిన టీఆర్ఎస్ దండు మీద ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్న వేళ లోనే.. సైబరాబాద్ పోలీసులు ఏకం గా గులాబీ పార్టీకి చెందిన ఫ్లెక్సీల్ని స్తంభాల కు దగ్గరుండి కట్టించిన వైనం పై సోషల్ మీడియా లో వ్యంగ్యస్త్రాలు పేలుతున్నాయి.