ఆడలేక మద్దెల ఓడు.. అన్నచందంగా మారింది.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి అని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే.. థర్డ్ వేవ్ తప్పదు అని హెచ్చరించారు అధికారులు. అంతేకాదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్.. సహా ఇతర పక్షాలు ఒకింత హడావుడి చే్స్తున్నాయి. ఈటల ఏకంగా పాదయాత్ర చేస్తున్నారు. ఈ పరిణామాలపై నేరుగా మాట్లాడలేని ప్రభుత్వం.. కరోనా థర్డ్ వేవ్ బూచిని చూపించి.. హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి.
అసలు.. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే ఆయన బాధ్యతగా వ్యవహరించలేదని, నిరంతరం హైకోర్టు ఆదేశాలు.. మొట్టికాయలతో నే చర్యలు తీసుకున్నారని.. పైగా రాత్రికి రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు.. లేదా రాత్రికి రాత్రి లాక్‌డౌన్‌ను ఎత్తేసి నప్పుడు.. ఎవరి నుంచి సూచనలు సలహాలు తీసుకున్నారని.. ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గకముందుగానే.. లాక్‌డౌన్ ఎత్తేసి.. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని అంటే.. ఎవరు బాధ్యులు..? అని ప్రశ్నిస్తున్నారు. ``లాక్‌డౌన్ పెట్టినప్పుడు.. మీరెందుకు పెట్టారని ఎవరూ ప్రశ్నించలేదు. ఇప్పుడు ఎత్తేసిన తర్వాత.. కూడా ఎవరూ ప్రశ్నించడం లేదు. అలాంటప్పుడు.. రాజకీయ కారణాలతో ప్రజలను హెచ్చరించడం ఏమేరకు సబబు?`` అనేది విశ్లేషకుల మాట.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. పైగా ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. రేపు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కాదనేవారు ఎవరూ లేరు. అయినప్పటికీ.. తప్పంతా ప్రజలదే అన్నట్టుగా ప్రభుత్వం వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? అంతా ప్రజలు గమనించడం లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రధానంగా.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 3-4 మండలాల్లో కేసులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైందని, కొందరు నేతలైతే మాస్కులు కూడా పెట్టుకోకుండా జనం మధ్య నిలబడి మాట్లాడుతున్నారని ప్రభుత్వం చెప్పడం చూస్తే.. ఫక్తు దీని వెనుక పొలిటికల్ రీజనే ఉందని చెబుతున్నారు. రేపు మీరు కూడా ప్రజల మధ్యకు రావాల్సిన అవసరం ఉంది.. హుజూరాబాద్ ఎన్నికలో ప్రచారం చేయాలి.. అప్పుడు కూడా ఇలానే చెబుతారా? అనేది విశ్లేషకుల ప్రశ్న. ఏదేమైనా.. చేతులు ఎత్తింది.. ఇప్పుడు చప్పట్లు కొడుతోంది కూడా .. కేసీఆరేనని కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.