జ‌గ‌న్‌కు ఇది ఇబ్బందే గురూ.. రాజ‌న్న‌రాజ్యంలో 'క్రాప్ హాలీడే'!!

Update: 2022-06-15 10:30 GMT
ఔను! ఒక జిల్లా కాదు... రెండు జిల్లాలు కాదు.. ఉమ్మ‌డి ఏపీలోని దాదాపు ఆరు జిల్లాల్లో రైతులు పంట విరా మం ప్ర‌క‌టించారు. తూర్పు, ప‌శ్చిమ గోదావరులు, ప్ర‌కాశం, క‌ర్నూలు, అనంత‌పురం(ఉద్యాన‌), చిత్తూరు స‌హా గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ ఏడాది ఖ‌రీఫ్‌లో పంట‌లు వేసేందుకు రైతులు ముందుకు రాలేదు. నిజానికి త‌మ‌ది రైతు రాజ్య‌మ‌ని, రైతుల‌కు ఎంతో మేళ్లు చేస్తున్నామ‌ని. గ‌త చంద్ర‌బాబు పాల‌న లో రైతుల‌ను ప‌ట్టించుకోలేద‌ని ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ చెబుతున్నారు.

తాజాగా ఉచిత పంట‌ల బీమా సొమ్మును రైతు ఖాతాల్లో జ‌మ చేస్తూ కూడా గ‌త వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా ఇప్పుడు త‌న పాల‌న‌లో స‌స్య‌శ్యామ‌లం అయింద‌ని.. అందుకే ఇక్క‌డ స‌భ పెట్టాన‌ని చెప్పుకొచ్చారు.

అయితే.. ఇప్పుడు ఇదే జిల్లాలో రైతులు ఖ‌రీఫ్ కు దూర‌మ‌య్యారు. నీరు ఇస్తామ‌ని చెబుతున్నా.. మేం పంట‌లు వేయ‌లేమ‌ని, వేసేది కూడా లేద‌ని తెగేసి చెప్పారు. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో రైతులు ఆనందంగా ఉన్నార‌ని ఎలా చెబుతున్నారో అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు అన్న‌దాత‌లు.

ప్ర‌స్తుతం ఎంతో చేశామ‌ని.. చేస్తున్నామ‌ని.. రైతుల విష‌యంలో గొప్ప‌గా చెబుతున్న జ‌గ‌న్ హ‌యాంలోనే రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు ల‌భించ‌డం లేదు. దాదాపు 3 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా.. ప్ర‌భుత్వ‌మే ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి బ‌కాయిలు పెట్టింది. ఇప్ప‌టికీ ఈనిధులు విడుద‌ల చేయ‌లేదు. మ‌రోవైపు పంట న‌ష్టాల‌కు సంబందించి కూడా ప్ర‌భుత్వం నుంచి రైతుల‌కు రావాల్సిన నిధులు చేర‌లేదు. ఆర్బీకేల్లోనూ కొనుగోళ్లు సాగ‌డం లేదు. దీంతో రైతులు విసిగి వేసారి పోయారు.

ఫ‌లితంగానే ప‌లు జిల్లాల్లో పంట‌ల విరామం ప్ర‌క‌టించేశారు. ఇది నైతికంగా రైతులు చేస్తున్న నిర‌స‌న‌లో భాగంగానే చూడాల‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.

రైతుల అండ‌తోనే రాజ్యం  చేప‌ట్టిన జ‌గ‌న్.. రాజ‌న్న రాజ్యం స్థాపిస్తాన‌ని చెప్పారు. ఇప్పుడు అదే రైతులు.. ఆయ‌న పాల‌న‌పై క‌స్సు మంటున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే రెండేళ్ల‌లో ఈ ప‌రిస్థితిని మార్చుకోక‌పోతే.. క‌ష్టాలు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News