రాఫెల్ కంటే పెద్ద స్కాం.. ఉద్దవ్ సంచలనం

Update: 2019-01-10 06:49 GMT
మిత్రపక్షంగా ఉన్నా.. సమయమొచ్చిన ప్రతీసారి బీజేపీని టార్గెట్ చేస్తూనే ఉంది శివసేనపార్టీ.. తాజాగా మరోసారి బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే. ప్రధాని మోడీ మానసపుత్రిక అయిన ఫసల్ బీమాపై ఉద్దవ్ థాక్రే సంచలన ఆరోపణలు చేశారు. ఫసల్ బీమా కూడా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వంటి కుంభకోణమేనని సంచలన ఆరోపణనలు చేశారు.

ప్రధాని నరేంద్రమోడీ గద్దెనెక్కగానే తన కలల పథకంగా 2015లో ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టారు. ప్రకృత్తి విపత్తులు, కీటకాలు, తెగుళ్ల కారణంగా షెడ్యూల్ పంటలకు ఎలాంటి నష్టం కలిగిన ఈ బీమాతో రైతులకు సహాయం చేస్తారు. ఈ పథకంపై తాజాగా మహారాష్ట్రలోని బీడ్ జిల్లాల్లో జరిగిన ఒక ర్యాలీలో ఉద్ధవ్ థాక్రే నిప్పులు చెరిగారు. ‘ఫసల్ బీమా ఎందరికి లబ్ధి చేకూర్చిందని..’ విమర్శించారు. ప్రజలకు రూ.2, రూ.5, రూ.100 చెక్కులు వచ్చాయి. ప్రజల మాటలనే తాను చెబుతున్నానన్నారు. ఫసల్ బీమా యోజనలో వేల కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి’ అని ఆరోపించారు. మోడీ ఫసల్ బీమాపై సాయినాథ్ అనే వ్యక్తి పుస్తకం రాశారని.. ఫసల్ బీమా యోజన రాఫెల్ కంటే పెద్ద కుంభకోణం అని ఉద్దవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రకటనలు ఉత్తి బుడగలని వ్యాఖ్యానించారు.  ఎన్నికల్లో రైతు సమస్యలను తీరుస్తానని గద్దెనెక్కాక మోడీ మరిచారని చెప్పుకొచ్చారు.

మోడీ విదేశీ పర్యటనలపై ఉద్దవ్ థాక్రే విమర్శలు గుప్పించారు. రోజుకో దేశం చొప్పున తిరిగే మోడీ.. దేశం మారుతోందని చెబుతున్నారని.. కానీ దేశం మారొచ్చు కానీ ప్రజలు మారడం లేదని.. వాళ్ల కష్టాలు మారడం లేదని ఉద్ధవ్ ఎండగట్టారు.

కాగా కేంద్రంలో, మహారాష్ట్రలో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఉన్న శివసేన పార్టీయే విమర్శలు గుప్పించడంతో ప్రతిపక్షాలకు అస్త్రం దొరికింది. దీనిపై ఎండగట్టేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది.



Full View
Tags:    

Similar News