దేశంలో ఇన్ని కోట్ల మంది మందుబాబులా?

Update: 2022-07-20 14:51 GMT
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా మన అలవాట్లు మాత్రం మారవన్నది నిజం. పుట్టుకతోనే వచ్చిన బుద్ది పుర్రె కాలేవరకు పోదంటారు. అది నిజమో కాబోలు.. అలవాట్లు లేని మనిషి ఉండరు. యవ్వనం దాటాక అందరూ మద్యం తాగడం అలవాటు చేసుకున్నారు. కొందరు బీర్లు, విస్కీ తాగడం హాబీగా పెట్టుకుంటారు. కొందరికి సిగరెట్ అలవాటు ఉంటుంది.  అయితే ఎక్కువమందికి  బీర్లు తాగేందుకు ఇష్టపడుతున్నారు. మారుతున్న జీవనశైలిలో ఇప్పుడు మద్యం అనేది ఒక నిత్యావసరంగా మారిపోయింది. .

ఒకప్పుడు పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును అంటారు. ఇప్పుడు మద్యం తాగని వాడిని ఆ మాట అంటున్నారు. మద్యం అనేది ఇప్పుడు ఆడ, మగా అనే తేడా లేకుండా అందరూ తాగే ఒక నిత్యావసర పానీయంగా మారిపోయింది.  జనాలు మద్యాన్ని తెగ తాగేస్తున్నారు. పండుగా, పబ్బం అన్న తేడాలేకుండా రోజువారీగా మద్యం తాగుతున్నారు.  విస్కీ, రమ్ము లాంటివి తగ్గించి చల్లటి బీర్లను తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో మద్యం విక్రయాల్లో రికార్డులు నమోదయ్యాయి. కరోనా ముగయడంతో మద్యం బాగా అమ్ముడుపోయాయి. ఉపశమనం పొందేందుకు చల్లటి బీర్లు తాగేస్తున్నారు.  

దేశంలో మద్యం తాగే విషయంలో భారతీయుల అభిరుచి మారినట్లు ఇటీవల ఓసర్వే తెలిపింది.. యువత ఎక్కువగా విస్కీకి బదులుగా బీర్లు తాగుతున్నారని.. మహిళల్లో వైన్ వినియోగం ఎక్కువైందని పేర్కొంది. దేశంలోని మందుబాబుల అభిరుచులు, అభిప్రాయాలను తెలుసుకున్న ఈ సర్వే సంస్థ.. 24 శాతం మంది బీర్, 22శాతం మంది వైన్, 16 శాతం మంది విస్కీ తాగుతున్నట్టు అంచనావేసింది.

తాజాగా కేంద్రప్రభుత్వం 15 కోట్ల మంది మద్యం సేవించేవారు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన నషా ముక్తి అభియాన్ లో భాగంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. దీంతోపాటు దేవంలో 3 కోట్ల మంది గంజాయి, 9.4 లక్షల మంది కొకైన్ వాడుతున్నట్లు గుర్తించారు. అయితే 272 జిల్లాల్లోని వారు అత్యధికంగా వీటిని వినియోగిస్తున్నారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలు కూడా ఉన్నాయి.

  మద్యం అమ్మకాలతో ఇప్పుడు అత్యధిక కొనుగోళ్లతో తెలుగు రాష్ట్రాలు రికార్డు సృష్టించాయి. ఇక తెలంగాణలోని వైన్ షాపులన్నీ కూడా భారీగా లాభాలు పొందాయట.. కరోనాతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా మద్యం బాబులు మాత్రం లిక్కర్ ను కొనడం ఆపలేదు.    

పండుగ సీజన్, హుజూరాబాద్ ఉప ఎన్నికతో తెలంగాణ రాష్ట్రంలో ఆల్ టైం రికార్డు మద్యం అమ్మకాలు సాగాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవల మద్యం ధరలు బాగా పెంచింది. బీర్ల ధరలు ఎక్కువగా ఉన్నా జనాలు కొనడం మానలేదు.. దేశంలో మద్యం అమ్మకాల్లో టాప్ 5లో తెలంగాణ ఉంది. దసరా పండుగ సందర్భంగా మరింత ఆదాయం పెరిగింది.
Tags:    

Similar News