టైటిల్ చూస్తే.. అదేంటబ్బా... టీడీపీని టీడీపీయే ఓడించిందా అనుకుంటున్నారా.. ఈ సారి ఫలితాల్లో టీడీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఓటర్లు.. విశాఖలో అదే పని చేశారు.. అయితే ఇక్కడ ఆ పని చేసింది టీడీపీ ఓటర్లు.. వినడానకి కొంత అతిశయోక్తిలా ఉన్నా ఇది నిజం.. టీడీపీ అభ్యర్థిని టీడీపీ సాంప్రదాయ ఓటర్లే ఓడించారు.. దీంతో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి భరత్ స్వల్ప తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది.. మొత్తం ఫలితాలు వచ్చిన తర్వాత నియోజికవర్గాల వారీగా ఎంపీ అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు చూసినప్పుడు ఈ షాకింగ్ విషయం బయటపడింది..
అటు ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడం.. గతంలో విశాఖ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ స్వర్గీయ ఎంవీవీఎస్ మూర్తి మనవడు కావడంతో టీడీపీ భరత్ ను రంగంలోకి దించింది. సినీ నటుడు బాలకృష్ణకు అల్లుడు కావడం అదనపు ఆకర్షణ.. ఇవన్నీ ఎన్నికల్లో బలంగా పనిచేశాయి కూడా.. అందుకే గట్టి పోటీ ఇచ్చి కేవలం 4 వేల ఓట్ల తెడా ఓడిపోయాడు.. అయితే ఈ ఓటమికి టీడీపీ ఓటర్లే కారణం అవ్వడం ఇక్కడ అసలైన ట్విస్ట్.. కారణం టీడీపీ ఓటర్లలో కొందరు జనసేనకు క్రాస్ ఓటింగు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని గట్టెక్కించారు. అసలేం జరిగిందంటే… జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు గాజువాకలో 58,539 ఓట్లు వచ్చాయి. సహజంగా అదే గాజువాక నుండి ఎంపీగా పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణకు అంతే ఓట్లు గానీ లేదా ఇంకొంచెం తక్కువ ఓట్లు గానీ రావాలి. మనం పవన్ కళ్యాణ్ తో పోలుస్తున్నాం కాబట్టి. అయితే ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణకు 68,567 ఓట్లు వచ్చాయి. అంటే పవన్ కళ్యాణ్ కంటే 10,028 ఓట్లు ఎక్కువ వచ్చాయి అన్నమాట. తెలుగుదేశం వారి ఓట్లు కొన్ని జేడీ లక్ష్మీనారాయణ కు పడ్డాయి. జేడీ లక్ష్మీనారాయణ గతంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా జగన్ కేసులను విచారించారు.. జగన్ జైలు జీవితానికి కారణమయ్యారు.. దీంతో వైసీపీ ఓటర్లు జేడీకి ఓట్లే వేసే పరిస్థితినే ఊహించలేం.. దీంతో టీడీపీ ఓటర్లే జేడీ వైపు మొగ్గు చూపడంతో మొదటికే మోసం వచ్చింది అన్నట్లు టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ భవితవ్యం గల్లంతైపోయింది..
ఫైనల్ ఫలితాలు వచ్చిన తర్వాత భరత్ కేవలం 4,414 ఓట్ల తేడాతో ఓడిపోయారు. విశాఖ సిటీ పరిధిలోని విశాఖ నార్త్ - సౌత్ - ఈస్ట్ - వెస్ట్ నాలుగింటిలోనూ టీడీపీ అభ్యర్థులు తిరుగులేని విజయాన్ని సాధించారు.. కానీ ఎంపీ అభ్యర్థిగా మాత్రం విజయం సాధించలేకపోవడానికి క్రాస్ ఓటింగ్ జరిగిందనేది సుస్పష్టం.. దీనికి గాజువాక ఉదాహరణ ఒక కేస్ స్టడీ మాత్రమే... మొత్తానికి టీడీపీ ఓటర్లే టీడీపీ అభ్యర్థి కొంపముంచడంతో కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు...