మ్యాచ్ చూసేందుకు వెళితే..చోర్..చోర్ అని అరిచారు!

Update: 2019-06-10 04:33 GMT
వేలాది కోట్లు బ్యాంకుల ద‌గ్గ‌ర రుణాలు తీసుకొని.. వాటిని తిరిగి చెల్లించ‌కుండా విదేశాల‌కు చెక్కేసిన ఆర్థిక నేర‌గాడు విజ‌య్ మాల్యాకు ఊహించిన ప‌రిణామం చోటు చేసుకుంది. తాను బ్యాంకుల ద‌గ్గ‌ర రుణాలు తీసుకున్నాన‌ని.. వాటిని తానిప్పుడు తీరుస్తానంటూ లండ‌న్ లోని విలాస జీవితాన్ని గ‌డుపుతూ చెబుతున్న ఆయ‌న మాట‌ల‌కు.. సాధార‌ణ ప్ర‌జ‌ల రియాక్ష‌న్ ఎలా ఉందో.. బ‌హిరంగంగా వెల్ల‌డైంది.

వేలాది కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి పోయిన మాల్యా తాజాగా లండ‌న్ లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ మ్యాచ్ చేసేందుకు ఓవ‌ల్ మైదానానికి వ‌చ్చారు. ఆదివారం జ‌రిగిన మ్యాచ్ కు కొడుకు సిద్ధార్థ్ తో పాటు వ‌చ్చిన ఆయ‌న‌.. స్టేడియంలోకి అడుగు పెట్టిన వెంట‌నే.. అక్క‌డి ప్రేక్ష‌కులు ఆయ‌న‌కు ఊహించ‌ని రీతిలో షాకిచ్చారు.

బ్యాంకుల‌కు దాదాపుగా రూ.9వేల కోట్ల‌కు పైనే ఎగ్గొట్టి.. గుట్టుచ‌ప్పుడు కాకుండా దేశం నుంచి వెళ్లిపోయిన ఆయ‌న కొంత‌కాలంగా లండ‌న్ లో ఉండ‌టం తెలిసిందే. తాజాగా మ్యాచ్ చూసేందుకు వ‌చ్చిన మాల్యాను చూసినంత‌నే అక్క‌డి వారు.. చోర్.. చోర్.. (దొంగ‌.. దొంగ‌) అంటూ అర‌వ‌టం మొద‌లు పెట్టారు. అంతేకాదు.. దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్న నినాదాలు వినిపించాయి. ఇలా ఊహించ‌ని విధంగా వెల్ల‌డైన ప్ర‌జాగ్ర‌హానికి ఆయ‌న షాక్ తిన్న ప‌రిస్థితి. గ‌తంలోనూ క్రికెట్ మ్యాచులు చూసేందుకు వ‌చ్చిన‌ప్ప‌టికి మాల్యాకు ఇలాంటి రియాక్ష‌న్ ఎదురుకాలేదు.

ఇదిలా ఉంటే.. మ్యాచ్ కు వెళ్లే స‌మ‌యంలో త‌నను క‌లిసిన మీడియాతో ఆయ‌న మాట్లాడారు. తాను మ్యాచ్ చూసేందుకు వ‌చ్చాన‌ని.. జులైలో జ‌రిగే త‌దుప‌రి విచార‌ణ‌కు సంబంధించిన ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు చెప్పారు. త‌ల్లి లాంటి త‌న దేశానికి బాధ‌ప‌డ‌కుండా చూడాల‌న్న‌దే త‌న ప్ర‌య‌త్న‌మ‌న్న ఆయ‌న‌.. టీమిండియా విజ‌యం త‌ర్వాత ట్వీట్ చేశారు.

అందుతో త‌న కొడుకుతో క‌లిసి మ్యాచ్ చూడ‌టం సంతోషంగా ఉంద‌న్న ఆయ‌న‌.. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాకు అభినంద‌న‌లు తెలిపారు.


Full View
Tags:    

Similar News