మంత్రి కదా బాధ్యత ఉండక్కర్లేదా..అలా చేస్తారా ?

Update: 2020-07-31 16:02 GMT
కరోనా దేశంలో విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే రోజురోజుకి దేశంలో రికవరీ శాతం కూడా పెరగడం మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఇక కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకొని ఇంటికి చేరడం అందరికి శుభవార్తే. కరోనా వచ్చినా , మళ్లీ ఆరోగ్యంగా ఇంటికి చేరాలి అని ఎవరు కోరుకోరు చెప్పండి. అలాగే కరోనా పై పోరాడి విజయం సాధించిన వచ్చిన వారిని అక్కున చేర్చుకోవడం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ, మరీ మితిమీరిపోయేలా కరోనాను జయిస్తే ఎదో ప్రపంచ యుద్ధం చేసి విజయ గర్వం తో ఇంటికి వచ్చినట్టుగా నానా రచ్చ చేయడం మీకే కాదు, మీతో కలిసిన వారికీ , అలాగే మీకుటుంబ సభ్యులకి , ఎదుటివారికి కూడా ఇబ్బందే.

తాజాగా అలాంటి ఓ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. మంత్రి కరోనా నుంచి కోలుకొని ఇంటికి వచ్చారని అతని అనుచరులు చేసిన హడావిడి ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. భౌతిక దూరం ..జనాలు ఒకేచోట గుమ్మికూడదు అన్న మాట మరిచి వేలాదిగా ఒకేచోట గుమ్మిగూడారు. ఇటీవలే తమిళనాడుమంత్రి సెల్లూరు రాజు కరోనా బారిన పడటంతో చెన్నైలోని ఎంఐవోటీ ఆస్పత్రిలో చికిత్స పొంది గురువారం డిశ్చార్జి అయ్యారు. ఈ విషయం తెలిసి ఆయన మద్దతుదారులు సంబరాల్లో మునిగితేలారు. తమ అభిమాన నేత కరోనా తో పోరాడి తిరిగి వస్తున్నాడు అంటే ఎవరికైనా ఆనందమే కానీ , ప్రస్తుత పరిస్థితులకి తగ్గట్టుగా అలోచించి నడుచుకునే ఉంటే బాగుండేది. కానీ, నిబంధనలు ఏ మాత్రం లెక్క చేయకుండా గుంపులు గుంపులుగా గుమ్మిగూడారు. మంత్రి కాన్వాయ్ ముందు టపాకాయలు పేల్చారు. ఆయన్ను కలిసేందుకు ఎగబడ్డారు. మరో ముఖ్యమైన విషయం వారిలో కొంత మంది మాస్కులు కూడా ధరించలేదు. ఇలా చేయడం వల్ల వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్సాహంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

కాగా ఇప్పటికే రాష్ట్రంలో 2,39,978 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,78,178 మంది కోలుకోగా.. ఇంకా 57,959 మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రికిగారికి ఇటువంటి స్వాగతాలు అవసరమా అంటున్నారు. మంత్రి అని అంత హడావిడి చేయడానికి ఏదేమైనా ఎన్నికల ప్రచారమా అంటూ కొందరు విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News