వేంకటేశ్వరస్వామికి భారత పౌరసత్వం ఇవ్వాలట!

Update: 2020-01-26 13:30 GMT
తెలుగు ప్రజలకు సుపరిచితమైన శ్రీవేంకటేశ్వరస్వామికి సంబంధించిన ఒక అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వేంకటేశ్వరస్వామి అన్నంతనే తిరుమల ఎలా గుర్తుకు వస్తుందో.. చాలామందికి హైదరాబాద్ శివారులో ఉన్న చిలుకూరి బాలాజీ టెంపుల్ కూడా గుర్తుకు వస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన పూజారి సీఎస్ రంగరాజన్ అర్చకత్వంతో పాటు.. కొన్ని సామాజిక అంశాల మీద గళం విప్పుతుంటారు. తాజాగా ఆయన చిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

శరణార్థులందరికి పౌరసత్వం ఇస్తున్నప్పుడు గుళ్లల్లో దేవుళ్లకు పౌరసత్వం ఎందుకు ఇవ్వరన్న ప్రశ్నను సంధిస్తున్నారు. చిలుకూరి బాలాజీ స్వామికి పౌరసత్వం ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్ అర్థం కానిదిగా అనిపించకమానదు. అయితే.. ఆయన ఎందుకిలాంటి వాదన వినిపిస్తున్నారన్నది ఆయన మాటల్లో వింటే కొంతలో కొంత క్లారిటీ వచ్చే వీలుంది.

పిల్లలు దేవుళ్లతో సమానం. అంటే.. దేవుళ్లంతా పిల్లలే. అంటే మైనర్లే. దేవుళ్లకు బదులుగా పూజారులు.. ఆలయ ట్రస్టీలు.. కార్యనిర్వహణ అధికారులే కోర్టుల్లో హాజరవుతారని.. దేవుళ్లకు పౌరసత్వం ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. ఎందుకిలా అంటే.. ఆయన పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5(4) ను ప్రస్తావిస్తారు. సదరు సెక్షన్ ప్రకారం మైనర్ కు పౌరసత్వ హక్కులు ఇవ్వొచ్చని చెబుతుందని.. ఆ ప్రకారం ఆలయాల్లోని అన్ని దేవుళ్లకు పౌరసత్వం ఇవ్వాలన్నది ఆయన డిమాండ్.

ఆయన మాటల్నే ప్రాతిపదికగా తీసుకుంటే.. దేశంలోని వివిధ దేవాలయాల్లోని దేవుళ్లకు పౌరసత్వం ఇవ్వాల్సి ఉంటుంది. మరీ.. డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకుంటుందో? లేదంటే లైట్ తీసుకుంటుందో చూడాలి. ఏమైనా.. విచిత్రమైన డిమాండ్ ను ఆయన తెర మీదకు తీసుకొచ్చారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News