ఐపీఎల్ : ధోని రిటైర్మెంట్‌పై సీఎస్కే సీఈవో క్లారిటీ

Update: 2021-07-08 10:43 GMT
అంతర్జాతీయ క్రికెట్‌ నుండి గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోనీ  ఐపీఎల్‌ కి ఈ ఏడాది తర్వాత వీడ్కోలు చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ లు సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే , ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం రిటైన్ పాలసీని బీసీసీఐ మార్చబోతోంది. టోర్నీలోకి అదనంగా మరో రెండు జట్లు రాబోతుండగా  నలుగురు ఆటగాళ్లని మాత్రమే రిటైన్ చేసుకునే వెసులబాటుని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ అవకాశం ఇవ్వనుంది. దీనితో ధోనీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా అని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్‌ ని ప్రశ్నించగా అయన దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

 ఎమ్ ఎస్  ధోనీ మరో ఏడాది లేదా రెండేళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ కి ఆడతాడు. అతను ఫిట్‌ గా ఉన్నాడు. ఇప్పటికీ నెట్స్‌ లో మెరుగ్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి ఎందుకు అతను ఐపీఎల్‌ కి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు , ధోనీ మా టీమ్‌ లో ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఒక కెప్టెన్‌ గానే కాకుండా  లీడర్‌ గా, అనుభవం ఉన్న ఆటగాడిగా టీమ్‌ లో ఉన్నాడు. ఇప్పటికీ  ధోనీ బెస్ట్ ఫినిషర్ టీమ్‌ కి బలం కూడా  అని కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన మహేంద్రసింగ్ ధోనీ 12.33 సగటుతో కేవలం 37 పరుగులే చేశాడు. అయితే  కెప్టెన్‌, వికెట్ కీపర్‌ గా మాత్రం చెన్నై టీమ్‌‌ విజయాల్లో ధోనీ క్రియాశీలక పాత్ర పోషించాడు. దాంతో  ఆడిన 7 మ్యాచ్‌ లకిగానూ ఐదింట్లో గెలుపొందిన చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
Tags:    

Similar News