కరోనా నేపథ్యంలో దుబాయ్ లో జరగబోతోన్న ఐపీఎల్ 2020 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్, ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లలో ఒకరైన సురేశ్ రైనా అర్ధంతరంగా టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. పంజాబ్ లో తన మేనమామ కుటుంబంపై జరిగిన దాడిలో తన మేనమామ, కజిన్ చనిపోవడంతోనే తాను భారత్ కు వచ్చానని రైనా చెప్పాడు. అయితే, ధోనీకు కేటాయించిన తరహా ప్లాట్ ను తనకు కేటాయించలేదని, తన ఫ్లాట్ కు కనీసం బాల్కనీ కూడా లేదన్న అసంతృప్తిని జట్టు మేనేజ్ మెంట్ తో రైనా వెళ్లగక్కినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎస్ కే యజమాని శ్రీనివాసన్ తనకు తండ్రి వంటి వారని, జట్టుతో ఎలాంటి విభేదాలు లేదని రైనా వివరణ ఇచ్చాడు. రైనా తన కొడుకులాంటి వాడని,కానీ, అతని రీఎంట్రీ తన చేతుల్లో లేదని శ్రీని తేల్చేశారు. దీంతో, బంతి ధోనీ కోర్టులో పడింది. అయితే, ఇప్పటివరకు రైనా స్థానంలో ఎవరిని తీసుకోలేదు.
ఈ నేపథ్యంలోనే జట్టు వాట్సాప్ గ్రూప్ నుంచి రైనాను తొలగించారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ విషయాన్ని ఓ ఫ్రాంచైజీ అధికారి వెల్లడించినట్లు ఓ వెబ్ సైట్ కథనం రాసింది. రైనా టీమ్‌మెనేజ్‌మెంట్‌కు క్షమాపణలు కూడా చెప్పాడని, రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. రైనా కూడా టోర్నీ మధ్యలో జట్టుతో కలిసే అవకాశముందని సంకేతాలిచ్చాడు. మరోవైపు, రైనా ప్లేస్ లో వైస్ కెప్టెన్ ఎవరంటూ సోషల్ మీడియాలో సీఎస్‌కేను ఒక అభిమాని ప్రశ్న అడిగాడు. దీనికి సీఎస్ కే ఫన్నీగా జవాబిచ్చింది. ‘ ‘మనకు వైజ్(తెలివైన) కెప్టెన్ ఉండగా, వైస్ కెప్టెన్ కోసం ఎందుకు ఆందోళన చెందుతున్నావంటూ ట్వీట్ చేసింది. దీనిని బట్టి రైనా ప్లేస్ లో ఎవరినీ తీసుకోలేదని, రైనా రీఎంట్రీ ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇక, కరోనా కష్టాల నుంచి సీఎస్ కేకు ఊరట లభించింది. జట్టులోని 13 మందికి నెగటివ్ రావడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.