పెరుగు మంచిదే.. కాని వారికి మంచిది కాదు

Update: 2021-08-16 07:38 GMT
సాధారణంగా ఎవరైనా అన్నం ఎంత తిన్నప్పటికీ పెరుగుతో ఒక్క ముద్దైనా తినాలనుకుంటారు.

ఇక పెరుగు లేకపోతే ముద్ద దిగనివారు కూడా బోలెడు మంది ఉంటారు. కర్డ్ అంటే ఫుడ్ లవర్స్ అందరికీ అంత ఇష్టం మరి. పెరుగు తినడం వల్ల మంచిగా నిద్ర పట్టడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని పెద్దలు చెప్తుంటారు. హెల్త్‌కు మేలు చేసే పెరుగు ప్రతీ ఒక్కరి తప్పనసరిగా తమ ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవాలంటుంటారు.కర్డ్‌లో కాల్షియం పుష్కలంగా ఉండగా, దాని ద్వారా ఎముకలకు మేలు చేస్తుంది. ఇక పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే అది కొలెస్ట్రాల్, హై బీపీ ఇష్యూస్‌ను క్లియర్ చేస్తుంది. పెరుగు చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. అయితే, పెరుగు నార్మల్ పర్సన్స్ తీసుకుంటే ఏం కాదు. కానీ, ఈ డిసీజెస్ ఉన్న వారు తీసుకుంటే వారి ఆరోగ్యంపై తీవ్రప్రభావం ఉంటుందట. ఆ ఇబ్బందులేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా చదవాలంతే..

పెరుగు ప్రతీ ఇంట్లో ఉండే ఫుడ్ ఐటం. కాగా, కర్డ్ తీసుకోవడం వల్ల బోన్స్, టీత్‌కు ‌మంచిది. కీళ్లనొప్పులున్న రోగులు పెరుగు తీసుకోవడం హెల్త్‌కు మంచిది కాదు. ఇక అర్థరైటిస్ రోగులు కర్డ్‌ను రెగ్యులర్‌గా తీసుకోకూడదు. కర్డ్‌ను వారు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల నొప్పి మరింత తీవ్రమవుతుంది. శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది పడేవారు కూడా కర్డ్ తీసుకోకూడదు ఆస్తమా పేషెంట్స్ కూడా పెరుగు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇకపోతే పెరుగు తినాల్సి వస్తే కేవలం ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లోనే తీసుకోవాలి. నైట్ టైమ్స్‌లో పెరుగు అసలే తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. అసిడిటీ ఇష్యూ ఉన్న వారు కర్డ్‌ను అస్సలు తీసుకోవద్దని చెప్తున్నారు. ఒకవేళ వారు నైట్ టైమ్‌లో పెరుగు తీసుకుంటే చాలా ఇబ్బందులే వస్తాయని అంటున్నారు.

జనరల్‌గా పెరుగు అనేది హెల్త్‌కు మంచిదే. కానీ, పైన పేర్కొన్న హెల్త్ ఇష్యూస్‌తో ఉన్నవాళ్లు కర్డ్‌ను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వారు పెరుగు తీసుకోవడం వల్ల హెల్త్‌పైన తీవ్రమైన ప్రభావం పడే చాన్సెస్ కూడా పొంచి ఉంటాయి. అయితే, పిల్లలు పెరుగును క్రమం తప్పకుంటా తీసుకుంటూ ఉండటం మనం గమనించొచ్చు.  అలా వారు కర్డ్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం ఒక టైమ్ వరకే మంచిదని పెద్దలు చెప్తుంటారు. కొంత కాలం తర్వాత బాడీలో కొవ్వు పెరిగి నంజు ఏర్పడే చాన్సెస్ ఉంటాయని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్యుల సూచన మేరకే లిమిట్‌లోనే కర్డ్ తీసుకోవడం వల్ల హెల్త్‌కు మేలు జరుగుతుంది. ఇక పెద్దవాళ్లు ఎప్పుడైనా పెరుగు తీసుకుంటూ ఉంటారు. అయితే, అన్ని కాలాల్లో పెరుగు తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ, వానాకాలంలో లిమిట్‌గా తీసుకోవాలట. ఎందుకంటే అప్పటికి ఉన్న వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది.

ఫలితంగా కోల్డ్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి పెరుగును లిమిట్స్‌లోనే తీసుకోవాలి. ఇకపోతే ఎండాకాలంలో పెరుగును అందరూ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా చేయడం మంచిదే. ఎందుకంటే అప్పుడు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఫలితంగా బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయి డీ హైడ్రేట్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే కర్డ్‌ను ఎక్కువగా తీసుకుంటే హెల్త్‌కు మంచి జరుగుతుంది. బాడీకి చలువ చేకూరుతుంది. కాబట్టి పెరుగును క్రమం తప్పకుండా ఎండాకాలంలో తీసుకుంటే మంచిదే. ఇకపోతే సమ్మర్‌లో పెరుగును యాజ్ ఇట్ ఈజ్‌గా కాకుండా చల్ల లేదా మజ్జిగగా తీసుకున్నా మంచి ఫలితమే ఉంటుందని పేర్కొంటున్నారు పలువురు.
Tags:    

Similar News