రాజస్థాన్ లోని భిల్వారా జిల్లా ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మూడు వారాల వ్యవధిలోనే కరోనా కోరల నుంచి బయటపడటమే కాదు.. తమ భవిష్యత్తును తామే రాసేసుకున్న వారి తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ప్రయత్నం చేయాలే కానీ కరోనాను తరిమికొట్టటం పెద్ద విషయం కాదన్న విషయాన్ని భిల్వారా జిల్లా ప్రజలు తమ చేతలతో చెప్పేశారు. నెల రోజుల క్రితం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదయ్యే జిల్లాలో ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. స్వల్ప వ్యవధిలో అలా ఎలా చేయగలిగారు? అన్నది ఒక ప్రశ్న. మరోవైపు.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో భిల్వారా మోడల్ ను అమలు చేయాలని కేంద్రం భావిస్తుండటం గమనార్హం. ఇంతకీ భిల్వారా మోడల్ ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..
భిల్వారా జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు మార్చి 19న నమోదైంది. ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడిలో కరోనా వైరస్ నుగుర్తించారు. అంతలోనే ఆ ఆసుపత్రి సిబ్బందికి కరోనా సోకింది. చూస్తుండగానే 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. అప్పటికే దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఉన్న జిల్లాగా భిల్వారా నమోదైంది. అలాంటి జిల్లాలో మార్చి 30 నుంచి ఇప్పటివరకూ కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదు కావటం గమనార్హం. తొలి కేసు నమోదైన రెండో రోజునే జిల్లాలో కర్ఫ్యూను విధించారు. జిల్లా సరిహద్దుల్ని మూసేశారు. అన్ని ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల్ని నిషేధించారు.
చివరకు ఇదెంతవరకూ వెళ్లిందంటే నిత్యవసర వస్తువులైనా సరే బ్యాన్ పెట్టేశారు. ఓపక్క ఇలా బయట నుంచి వచ్చే అన్ని దారుల్ని మూసేసిన యంత్రాంగం.. మరోవైపు ఏడు వేల టీంలతో కలిసి జిల్లా మొత్తాన్ని చుట్టేశారు. అందరిని సర్వే చేశారు. అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. ఏ మాత్రం సందేహం ఉన్నా క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. 20 లక్షల మంది ప్రజల్ని చాలా తక్కువ వ్యవధిలో సర్వే పూర్తి చేశారు.
తొలి కేసులో బాధితుడైన వైద్యుడు ఉండే ఒక కిలోమీటర్ ప్రాంతాన్ని.. ఆసుపత్రి ని కరోనా జోన్ గా డిక్లేర్ చేశారు. మూడు కి.మీ. ప్రాంతాన్ని బఫర్ జోన్ గా డిసైడ్ చేశారు. ఇదే రీతిలో కేసులు నమోదైన అందరి ఇళ్ల చుట్టూ ఇదే తీరుతో నిర్ణయాలు తీసుకున్నారు. క్లస్టర్ మ్యాపింగ్ ద్వారా ప్రత్యేక టీంనురంగంలోకి దించి.. అందరికి పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రాంతాలతో పాటు.. ఇక్కడ సేవలు అందించే అంబులెన్సులు.. పోలీస్ వాహనాలు.. స్క్రీనింగ్ కేంద్రాలు.. క్వారంటైన్ కేంద్రాల్ని మందులతో శుద్ధి చేశారు.
ఇక్కడితో ఆగకుండా కరోనా బాధితుల్ని కలిసి ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించారు. అలాంటి వారిలో ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని కూడా క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. లక్షణాలుకనిపించిన వారిని ఐసోలేషన్ వార్డులో చేర్చారు. కరోనా రోగుల్ని కలిసి.. వారి ద్వారా ఆ లక్షణాలు కనిపించిన వ్యక్తుల్ని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామం.. పట్టణం.. నగరాల వారీగా కరోనా కెప్టెన్లు.. ఫైటర్లన నియమించారు. వివిధ ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల్ని రంగంలోకి దించారు. హోం క్వారంటైన్లో ఉన్న వారి అవసరాల్ని తీర్చేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.
అదే సమయంలో వలస కూలీల రాకపోకల్ని.. వారి అవసరాల్ని ట్రాక్ చేశారు. భిల్వారా నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్న వేళ.. నిత్యవసర అనుమతులకూ నిషేధాన్ని విధించారు. ప్రభుత్వమే కూరగాయలు.. పండ్లు.. పాలు సరఫరా చేయటం గమనార్హం. పేదలకు ఆహార పాకెట్లను అందజేస్తున్నారు. ఇలా పక్కా వ్యూహంలో వెళ్లిన భిల్వారా రెండు వారాల వ్యవధిలోనే కొత్త కేసులకు చెక్ చెప్పటమే కాదు.. కరోనాను కంట్రోల్ చేయటంలో సక్సెస్ అయ్యింది. కాస్త కష్టమైనా ఇదే విధానాన్ని అమలు చేస్తే.. కరోనాను తరిమికొట్టటం పెద్ద విషయం కాదన్న భావన కలుగక మానదు.