కేంద్ర ప్రభుత్వం రూ.500 - రూ.1000 నోట్ల చలామనీని నిలిపివేయడంపై హైదరాబాద్ ఎంపీ - ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ తనదైన శైలిలో స్పందించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని అసద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోట్ల రద్దును ప్రకటించడానికి కనీసం రెండు నెలల ముందు ప్రజలకు సమాచారం ఇవ్వాల్సిందని అసద్ వ్యాఖ్యానించారు. గతంలో పిలిప్పిన్స్ - యూరోపియన్ దేశాలు తమ పాత కరెన్సీని నిలిపివేసి కొత్త వాటిని ప్రవేశపెట్టే ముందు అక్కడి ప్రజలకు ముందే తెలియజేసి కొంత సమయం ఇచ్చిన తరువాత కొత్త కరెన్సీని తీసుకువచ్చినట్టు అసదుద్దీన్ వివరించారు. ఇక్కడ అలాంటి పనులేవీ చేయకపోవడంతో అందరితో పాటు తాను సమస్యల పాలు అయినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అసదుద్దీన్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. నోట్ల తయారీకి కావాల్సిన సిరా - దారాన్ని సరఫరా చేసే సంస్థ ఒకటేనని అసదుద్దీన్ వివరించారు. భారత్ తో పాటు పాకిస్తాన్ కు కూడా ఒకే రకమైన వస్తువును ఆ కంపెనీ పంపిస్తోందని తెలిపారు. పాకిస్తాన్ లో వీటినే ఉపయోగించి కరెన్సీని తయారు చేస్తున్నప్పుడు భారత్ లో కరెన్సీ రద్దు నిర్ణయం తీసుకోవడం వెనక ఆంతర్యం ఏంటని అసదుద్దీన్ నిలదీశారు. దీనిపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. పాత నోట్లను తీసుకొని రూ.2000 నోటును బ్యాంకు అధికారులు ప్రజల చేతిలో పెడుతుండటంతో దానిని చిల్లరగా మార్చేందుకు తెగ ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అంత పెద్ద నోటను నిత్యావసరాల కోసం ఎలా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని, దానికి సరిపడా చిల్లర ఎక్కడి నుంచి వస్తుందని అసదుద్దీన్ ప్రశ్నించారు. తన అకౌంట్ లో డబ్బులు ఉన్నా కనీసం వాటిని బయటకు తీసి వాడుకోలేని స్థితి ఏర్పడిందని అసదుద్దీన్ వాపోయారు. దేశంలో 86 శాతం నోట్లు రూ.500 - రూ.1000 రూపంలోనే ఎక్కువగా చలామనీ అవుతుండగా ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే ఈ నిర్ణయం వెల్లడించడంతో అంతా అవస్తలు పడుతున్నారని మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/