కరోనా వైరస్ ..చైనా లోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల ప్రజలు పిట్లలు రాలిపోయినట్లు రాలి పోతున్నారు. ఇప్పటికే ఈ కరోనా వైరస్ వల్ల దాదాపుగా 3,900 మంది చనిపోయారు. అలాగే సుమారుగా లక్ష మందికి పైగా ఈ వైరస్ భారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఈ కరోనా గురించి వివిధ దేశాల ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ..కరోనా విజృంభణ మాత్రం ఆగడంలేదు. అలాగే ప్రస్తుతం ఈ వైరస్ ప్రభావం నుండి చైనా కొంత కోలుకున్నప్పటికీ కూడా , మిగిలిన దేశాలు ఈ కరోనా వైరస్ ప్రభావంతో అల్లాడిపోతున్నాయి.
ఇకపోతే , ఈ వైరస్ ఎవరినుండి , ఎలా వ్యాప్తి చెందుతుందో అని అందరూ భయం తో వణుకుతూ , చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది మొఖానికి మాస్క్ లేకుండా ఇంట్లో నుండి బయటకిరావడంలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త అందరిని భయ పెడుతోంది. అదేమిటి అంటే ..చేతులు మారే కరెన్సీ నోట్ల నుంచి కూడా కరోనా -19 వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత అధ్యయనాలు కూడా ఇదే విషయా న్ని స్పష్టం చేస్తున్నాయి.
2018లో చేపట్టిన ఒక అధ్యయనంలో రూ.100, 50, 20, 10 నోట్ల నుంచి ఈ కొలీ బ్యాక్టీరియా, సాల్మొనెల్లా టైఫి, మరో రెండు ఇతర వైరస్ వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. ఈ అధ్యయనం లో భాగంగా కరెన్సీ నోట్లు, కాయిన్స్ ను పరిశీలించారు. వాటిపై బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర పరాన్నజీవులు ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి కరోనా కూడా కరెన్సీ నోట్ల ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటున్నారు. చైనా లో ఇప్పటికే లిక్విడ్ కాష్ ని బ్యాండ్ చేసారు. కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కరెన్సీ నోట్లపై ఆంక్షలు విధించింది చైనా. కరెన్సీని తగ్గించి, ఇ-కామర్స్, నెట్ బ్యాంకింగ్ లను వాడుకోవాలని కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఏదేమైనా ఇక నుండి డబ్బులు ఇతరుల నుండి తీసుకోవాలన్న కూడా ఒకసారి ఆలోచించి తీసుకోవాలి ...