అమెరికా డాలర్‌ జోరు .. భారీగా పతనమైన రూపాయి !

Update: 2021-03-30 14:30 GMT
దేశీయ కరెన్సీ రూపాయి విలువ భీకర స్థాయిలో పడిపోయింది. యూఎస్ డాలర్‌ 73.09 తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ  34 పైసలు  దిగజారింది. గత ఏడాదిన్నర కాలంలో రూపాయి విలువ.. తొలిసారి ఇంత దారుణంగా పతనం కావడం ఇదే మొదటిసారి. ప్రధానంగా అమెరికా కరెన్సీ డాలరు పుంజుకోవడం, ముడి చమురు ధరలు పెరగడంతో డాలరుతో పోలిస్తే రూపాయి 34 పైసలు తగ్గి 72.85 స్థాయికి పడిపోయింది. డాలర్ ఇండెక్స్ 0.01 శాతం పెరిగి 92.94 కు చేరుకుంది. గత కొంత కాలంలో రూపాయి విలువ తొలిసారి ఇంత దారుణంగా పతనం కావడం గమనార్హం.

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య దెబ్బతిన్న మదుపర్ల సెంటిమెంట్‌.. రూపాయిని తీవ్రంగా ప్రభావితం చేసిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు విశ్లేషించారు. అంతేకాకుండా పెరుగుతున్న చమురు ధరలు కూడా పతనమవ్వడానికి కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  శుక్రవారం రూపాయి 72.51 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్‌ ఏకంగా 870 పాయింట్లు ఎగియగా,నిఫ్టీ 263పాయింట్లు లాభంతో కొనసాగుతోంది. హోలీ కారణంగా ఫారెక్స్ మార్కెట్  సోమవారం పనిచేయని సంగతి తెలిసిందే.

మూడురోజుల విరామం తరువాత, గ్లోబల్ మార్కెట్ల సానుకూల  సంకేతాలతో మంగళవారం కీలక సూచీలు లాభాల దౌడు తీస్తున్నాయి.  ట్రేడర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. ఆరంభ లాభాలనుంచి మరింత దూసుకపోతున్న సెన్సెక్స్‌ 858 పాయింట్ల లాభంతో 49866 వద్ద, నిఫ్టీ 262 పాయింట్లు ఎగిసి 14769వద్ద  కొనసాగుతున్నాయి.  అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల ధోరణి నెలకొంది.  ప్రధానంగా మెటల్‌, బ్యాంకింగ్‌, ఫార్మా రంగ షేర్లు లాభపడుతున్నాయి. 
Tags:    

Similar News