మార్చి వరకు మనీ కష్టాలు తప్పవట..

Update: 2016-12-18 09:56 GMT
పెద్ద నోట్ల రద్దుతో పుట్టుకొచ్చిన కరెన్సీ కష్టాలకు మార్చి నెల వరకు తెరపడే ఛాన్సే లేదట.  ప్రస్తుతం కరెన్సీ ప్రెస్ లన్నీ 50 శాతం అదనంగా ప్రింటు చేస్తున్నా కూడా మార్చి ముగింపు వరకు కష్టాలు తీరే ఛాన్సు లేదంటున్నారు. జనవరి చివరి నాటికి చాలావరకు నోట్లు అందుబాటులోకి వస్తే కొంతవరకు పరిస్థితి మెరుగయ్యే అవకాశాలున్నాయి.
    
పెద్ద నోట్ల రద్దు నాటికి 1570 కోట్ల రూ.500 నోట్లు... 630 కోట్ల రూ.వెయ్యి నోట్లు చలామణీలో ఉండేవి.  అంటే వాటి స్థానంలో అవే నోట్లను ప్రింటు చేస్తే 2200 కోట్ల నోట్లను ప్రింటు చేయాలి. మన కరెన్సీ ప్రెస్ల సామర్థ్యం కూడా అంతే. కానీ... వెయ్యి నోట్లకు బదులు రూ.2 వేల నోట్లు తేవడంతో 1800 కోట్ల నోట్లు ప్రింటు చేస్తే సరిపోతుంది.
    
ఇండియాలో కరెన్సీ ప్రింటింగ్ కెపాసిటీ 2200 కోట్ల నోట్లు. కానీ... తాజా పరిణామాలతో దాన్ని 50 శాతం పెంచగలిగారు. అంటే ఏడాదికి 3300 కోట్ల నోట్లను ప్రింటు చేయొచ్చన్నమాట. నోట్ల రద్దు తరువాత ఇప్పటికి 300 కోట్లకు పైగా నోట్లను ముద్రించారు. అందులో 99 శాతం 2 వేల నోట్లే. అంటే పాత వెయ్యి నోట్లకు సరిపడా మొత్తంలో 2 వేల నోట్లు మార్కెట్లోకి వచ్చేసినట్లు. వచ్చే రెండు మూడు నెలల్లో 500నోట్లు ఇదే వేగంతో ముద్రిస్తే కష్టాలు తీరుతాయి. ప్రస్తుతం అన్ని ప్రెస్ లలో ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వకుండా రోజుకు మూడు షిఫ్టుల్లో ముద్రణ చేపడుతున్నారు. మార్చి చివరి నాటికి సుమారు 900 కోట్ల 500 నోట్లను ముద్రించే ఛాన్సుంది. అప్పుడు చాలావరకు ఇబ్బందులు తీరుతాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News