సముద్ర అలలతో కరెంట్.. ప్రయోగాల ఎక్కడంటే!

Update: 2021-03-28 03:30 GMT
సంప్రదాయ విద్యుత్ కొరత రోజురోజూకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సంప్రదాయేతర కరెంట్ ఉత్పత్తి కోసం ప్రయోగాలను ముమ్మరం చేశారు. సముద్ర అలల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాగర కెరటాలతో విద్యుత్ తయారీ ప్లాంట్ ను విశాఖలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే ఇజ్రాయిల్ కు చెందిన ఎకోవేవ్ పవర్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.

ఇజ్రాయెల్ కు చెందిన ఆ సంస్థ ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లో అధ్యయనం చేయనుంది. విశాఖ నుంచి కాకినాడ వరకు ఉన్న తీర ప్రాంతంలోని పలు కీలక ప్రాంతాల్లో పరిశోధనలు చేయనుంది. రాష్ట్రంలో ఉన్న వనరులపై ఆ సంస్థతో కలిసి ఏపీ ప్రభుత్వం సమీక్షించనుంది. అనంతరం విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా ప్లాంట్ ఏర్పాటు చేసి కరెంట్ ను తయారు చేస్తారు.

సముద్ర కెరటాల నుంచి ఉత్పత్తి చేసిన కరెంట్ ను జెన్కోకు విక్రయిస్తారు. దాదాపు 170 వాట్ల విద్యుత్ ను తయారు చేయాలని ఓ అంచనా. జాతీయ సముద్ర సాంకేతిక సంస్థ ఈ బాధ్యతల్లో జోక్యం చేసుకోనుంది. ఈ పరిశోధనల అనంతరం సముద్ర అలలతో విద్యుత్ ను తయారు చేసే ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు.

ఈ ప్రయోగాలు విజయవంతం అయితే ఏపీలో మరిన్ని పరిశోధనలు జరిగే అవకాశం ఉంది. క్రమంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ల ఏర్పాటు పెరగనుంది. సంప్రదాయేతర పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల విద్యుత్ కొరత ఉండదు.  
Tags:    

Similar News