దిష్టిబొమ్మ‌లుగా బీజేపీ బిగ్ షాట్స్!

Update: 2018-07-18 13:40 GMT
ఎల‌క్ష‌న్ల స‌మ‌యంలో ఆయా పార్టీల కార్య‌క‌ర్త‌లు...ఇబ్బ‌డి ముబ్బ‌డిగా బ్యాన‌ర్లు, క‌టౌట్లు పెట్ట‌డం ష‌రా మామూలే. త‌మ నాయకుల నిలువెత్తు క‌టౌట్లు....బ్యాన‌ర్ల కోసం....వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టేందుకు కూడా కార్య‌క‌ర్త‌లు వెనుకాడ‌రు. అయితే, ఎల‌క్ష‌న్లు పూర్త‌యిన త‌ర్వాత‌....వాటిని ఏదో ఒక మూల‌న ప‌డేయడం మూమూలే. ఇదే త‌ర‌హాలో కొద్ది రోజుల క్రితం క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా.....ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షాల క‌టౌట్ లు అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ద‌ర్శ‌న‌మిచ్చాయి. అయితే, ఎన్నిక‌లు పూర్త‌యి.....అక్క‌డ కుమార‌స్వామి స‌ర్కార్ కొలువుదీరిన‌ప్ప‌టికీ.....ఆ భారీ క‌టౌట్ లు ఇంకా అలాగే ఉన్నాయి. అయితే, అవ‌న్నీ ర‌హ‌దారుల ప‌క్క‌నో..ఊరి న‌డిబొడ్డునో ఉన్నాయ‌నుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే! ఆ క‌టౌల్ ల‌న్నీ ఇపుడు ఎంచ‌క్కా పొలాల‌కు దిష్టిబొమ్మ‌లుగా మారాయి. ప్ర‌స్తుతం ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

పుర్రెకో బుద్ధి .....జిహ్వ‌కో రుచి అన్నారు పెద్ద‌లు.... అదే త‌ర‌హాలో....ఎన్నిక‌ల నాటి క‌టౌట్ ల‌ను కొంద‌రు స్థానికులు త‌మ పంట పొలాల‌కు దిష్టి త‌గ‌ల‌కుండా దిష్టి బొమ్మ‌లుగా ఏర్పాటు చేశారు. పచ్చని పంట పొలాల మధ్య మోదీ, షా, య‌డ్డీల క‌టౌట్లు చిరుమంద‌హాసంతో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. క‌ర్ణాట‌క‌లోని తరికేరి రైతులు త‌మ పొలాల్లో మొల‌కెత్తుతున్న నాట్ల‌కు దిష్టి త‌గ‌ల‌కుండా ఈ ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్లకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు. కేవ‌లం దిష్టి బొమ్మ‌లుగానే వీటిని వాడుతున్నామ‌ని చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా రోడ్ల‌పై ఉంచిన కటౌట్లను....ఇపుడు పంటపొలాల్లో ఉంచుతున్నామ‌ని రైతులు క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా....అక్క‌డి రైతుల‌కు వ‌చ్చిన ఈ ఐడియాను చూసి ప‌క్క గ్రామాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు. త‌మ పొలాల్లో కూడా ఈ త‌ర‌హా క‌టౌట్ల‌ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. వాట్ యాన్ ఐడియా స‌ర్ జీ అంటూ...ఆ రైతుల‌ను పొగుడుతున్నారు.


Tags:    

Similar News