తెలంగాణ కేబినెట్ లో త్వరలోనే ఓ కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఈ విషయం ఇప్పటికే బహిరంగం కాకున్నా... ప్రభుత్వ పెద్దలతో పాటు సదరు మార్పుతో ప్రభావితం కానున్న ఇద్దరు మంత్రులకు కూడా ఇప్పటికే సమాచారం చేరిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ... అధికారికంగా ఉత్తర్వులు వెలువడే దాకా దీనిని గోప్యంగా ఉంచేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారు. అయినా ఆ కీలక మార్పు విషయానికి వస్తే... కేసీఆర్ కేబినెట్ లో కీలక శాఖ అయిన ఆర్థిక శాఖకు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కు... అదనపు బాధ్యతలుగా ఉన్న పౌరసరఫరాల శాఖ బాధ్యతలను తప్పించి కొత్తగా బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పజెబుతారట. ప్రస్తుతానికి ఆర్థిక శాఖతో పాటు సివిల్ సప్లైస్ ను కూడా ఈటల సమర్ధవంతంగానే నిర్వహించారు.
ఇప్పటికిప్పుడు శాఖను మార్పు చేయాల్సిన అవసరమేమీ కూడా లేదు. మరి మార్పు ఎందుకనేగా మీ డౌటు? అక్కడికే వస్తున్నాం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా మొన్నటిదాకా ఐఏఎస్ అధికారులనే నియమించేవారు. ఒక్క ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి పోస్టులు మినహా అన్ని కార్యనిర్వాహక బాధ్యతలన్నీ ఐఏఎస్‌లకే దక్కేవి. అయితే ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి... తొలిసారిగా ఐఏఎస్ అధికారులకు కేటాయించే గురుకుల పాఠశాలల కమిషనర్ పోస్టును ఐపీఎస్ అధికారిగా ఉన్న ప్రవీణ్ కుమార్‌కు కట్టబెట్టారు. సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగే సంక్షేమ హాస్టళ్లలోనే విద్యనభ్యసించిన ప్రవీణ్ కుమార్.. వాటిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతానని చెప్పడంతో కిరణ్ కుమార్ రెడ్డి కానలేకపోయారు.
ఇదే కోవలోనే మిల్లర్ల ఇష్టారాజ్యం, అధికారుల మితిమీరిన అవినీతితో కుళ్లిపోయిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ను కూడా సంస్కరించాలని కేసీఆర్ తలచినట్లున్నారు. ఆ సంస్కరణ బాధ్యతలు ఎవరికి కట్టబెట్టాలని యోచించిన కేసీఆర్‌కు... ఐపీఎస్ అధికారిగా నిలువెత్తు నిజాయతీతో పాటు విధి నిర్వహణ పట్ట అంకిత భావం ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కనిపించారు. అనుకున్నదే తడవుగా సీవీ ఆనంద్‌ను తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయరాదని తీర్మానించుకున్న సీవీ ఆనంద్ కూడా వెనువెంటనే ఆ పోస్టులో చేరిపోయారు. చేరిన అనతికాలంలోనే ఆ శాఖలోని మకిలిని కడిగిపారేశారు. మిల్లర్లను దారికి తెచ్చారు. ప్రభుత్వానికి రావలసిన ధాన్యాన్ని సకాలంలో తెప్పించేశారు. అంతేనా... మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావలసినన కోట్లాది రూపాయల పెండింగ్ బిల్లులను కూడా ముక్కు పిండి వసూలు చేశారు.
విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే సీవీ ఆనంద్... సింగం సినిమాలో తమిళ హీరో సూర్యలానే కనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. రాజకీయ నేతలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండానే తన పని తాను చేసుకుపోయే మనస్తత్వం ఉన్న సీవీ ఆనంద్ తో ఈటల సర్దుకుపోలేకపోయారట. ఈ క్రమంలో ఆయన సివిల్ సప్లైస్ నుంచి తనను తప్పించాలని కేసీఆర్ కు మొర పెట్టుకున్నారట. తన కేబినెట్ లోని సీనియర్ మంత్రి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్... ఈటల నుంచి సివిల్ సప్లైస్ ను తప్పించేసి కొత్తగా బీసీ సంక్షేమాన్ని అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేశారట. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న జోగు రామన్నకు సివిల్ సప్లైస్ ను అప్పగించేందుకు కూడా రంగం సిద్ధమైపోయిందట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/