లాటరీ అని చెప్పి 16 లక్షలు దోచేశారు

Update: 2020-10-02 17:57 GMT
షాప్‌ క్లూస్ ‌లో షాపింగ్‌ చేయగా ఆ సంస్థ ద్వారా మీరు రూ. 45 లక్షల లాటరీ గెలుచుకున్నారంటూ నమ్మించిన సైబర్ ‌నేరగాళ్లు ఓ మహిళ నుంచి రూ. 16 లక్షలు కాజేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నల్లకుంటలో నివాసముండే ఓ మహిళ ఇంటికి.. మే నెలలో షాప్‌ క్లూస్‌.కామ్‌ నుంచి స్క్రాచ్‌ కార్డు పంపించినట్లు సైబర్‌ నేరగాళ్లు ఒక కార్డు పంపించారు. ఆ కార్డు స్క్రాచ్‌ చేయగానే రూ. 45 లక్షల లాటరీ గెలుపొందారనే మెసేజ్‌ను చూసిన ఆమె... సంతోషంతో అందులో ఉన్న ఫోన్ ‌నంబర్ ‌ను సంప్రదించింది.

దీనితో అవు ను మేడం మీరు గతంలో షాప్‌ క్లూస్‌ లో షాపింగ్‌ చేశారు.. అందుకే ఆ సంస్థ పాత వినియోగదారుల కోసం లక్కీ లాటరీ నిర్వహించింది... అందు లో భాగంగానే మీ ఇంటికి స్క్రాచ్‌ కార్డు పంపించారు.. మీ చేతులతో స్క్రాచ్‌ చేయడంతో మీరు లాటరీ గెలుపొందారంటూ ఆమెను ఆకాశన్నెత్తారు.ఆమె వాళ్ల మాటలను గుడ్డిగా నమ్మేసింది. అయితే, ఇంట్లో ఆమె తన సోదరుడితో పాటు ఉంటుంది. సోదరుడు వైజాగ్‌కు వెళ్లి అక్కడ లాక్ ‌డౌన్‌ తో చిక్కుకున్నాడు.

దీంతో ఆ విషయం ఆమె ఎవరితోనూ చెప్పలేదు. దీంతో సైబర్‌ నేరగాళ్లు చెప్పింది నిజమని నమ్మింది. మీరు లాటరీ డబ్బులు తీసుకోవాలంటే ముందుగా ప్రాసెసింగ్‌ ఫీజు, ఆ తరువాత ఆదాయపన్ను , జీఎస్‌టీ, సెక్యూరిటీ డిపాజిట్‌, ఆర్బీఐ చార్జి అంటూ మే నుంచి జూలై నెల వరకు ఆమె నుంచి దఫ దఫాలుగా రూ. 16 లక్షలు వసూలు చేశారు. ఆమె తన బంగారాన్ని కూడా కుదవ పెట్టి సైబర్‌ నేరగాళ్లకు డబ్బులు చెల్లిస్తూ వెళ్లింది. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో ఆమె సోదరుడికి విషయం తెలిపింది. ఇదంతా మోసం అని గుర్తించి గురువారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Tags:    

Similar News