సైబర్ క్రైమ్ : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రూ. 8 లక్షలు పోగొట్టుకున్నాడు ...
ప్రస్తుత రోజుల్లో సైబర్ క్రైమ్ గురించి అందరికి తెలిసిందే. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఐడియాతో ముందుకొచ్చి అమాయకులని మోసం చేస్తున్నారు. అయితే, సైబర్ నేరగాళ్లు మోసం చేస్తుంటారనే అవగాహన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కి ఉంది. ఓ రోజు అతడికి కార్డు వివరాల కోసం అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తే అతడిని పోలీసలుకు పట్టిస్తానంటూ బెదిరించగానే అతడు ఫోన్ కట్ చేశారు. ఇలా అతడికి వచ్చే కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఇంత జాగ్రత్తగా ఉన్నా ఇతడు నేరగాళ్ల ఉచ్చులో మాత్రం పడిపోయాడు. ఈ సారి ఫోన్ ద్వారా కాకుండా వాట్సాప్ లో ఓ లింక్ వచ్చింది.
ఆ మెసేజ్లో ఏముంది అంటే ... రూ.20 వేలు పెట్టుబడిగా పెట్టి రూ.6,200లు లాభం పొందండి అని ఓ రోజు మెసేజ్. అయితే అతడు నమ్మలేదు. ఇది కూడా సైబర్ నేరగాళ్ల పనే అని సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత అసలు విషయం ఏంటని.. ఆ నంబర్ కు కాల్ చేసి అడిగాడు. ఇది ఒక వ్యాపారం లాంటిది. మీరు రూ.20 వేల పెట్టుబడి పెడితే కొన్ని రోజుల తర్వాత మీరు రూ.6200 లాభం పొందుతారని చెప్పారు. అయితే అతడికి వస్తున్న జీతం డబ్బులు సరిపోకపోవడంతో కొంత డబ్బును ఏదైనా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టేందుకు ప్రయత్నించేవాడు. ఆ డబ్బులను ఇందులో ఇన్ వెస్ట్ చేద్దాం అనుకొని పెట్టాడు.
ఆ వెంటనే ఇంజినీర్‌కు ఓ లింక్ ఇచ్చిన నేరగాళ్లు, ప్రత్యేకంగా ఓ పేజీని కూడా కేటాయించారు. ఈ పేజీలో ఇంజినీర్ పెట్టుబడి, లాభాల వివరాలు ఉన్నాయి. రూ.20వేలు పెట్టుబడిగా రూ.6200 లాభం వచ్చినట్లు పేజీలో కనిపించింది. దీంతో అతడి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పూర్తిగా నమ్మేశాడు. మరో రెండు సార్లు రూ.20వేలు చొప్పున పెట్టుబడి పెట్టాడు. లాభాలు వచ్చినట్లు పేజీలో సూచించింది. ఆ పేజీలో ఉన్న విత్ డ్రా బటన్ నొక్కి అసలు, లాభం వచ్చిన డబ్బును సంతోషంగా విత్ డ్రా చేసుకున్నాడు. ఇక ఆ సైట్ ను బాగా నమ్మి , ఇది బాగానే ఉందనుకొని ఈ సారి అప్పు చేసి మరీ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు.
అత్యాశకు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పెద్ద మొత్తంలో లాభం పొందాలని ఒకేసారి రూ. ఎనిమిది లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత లాభం వచ్చినట్టు పేజీలో కనిపించింది. చాలా సంతోష పడ్డాడు. కానీ ఇక్కడే ఒక ట్టిస్ట్ జరిగింది. అతడి పేజీ ఓపెన్ చేసి విత్ డ్రా చేద్దాం అనుకున్నాడు. కానీ అందులో విత్ డ్రా అనే ఆప్షన్ మాత్రం కనిపించలేదు. వెంటనే కాల్ చేశాడు. కానీ స్విచ్ ఆప్ రావడంతో మోసపోయినట్లు గ్రహించిన , నేరగాళ్లు రూ. ఎనిమిది లక్షలు కొట్టేసినట్లు గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.