ఒక ఇంటి కోసం రూ.425కోట్లు ఖర్చు చేసిన ఆదిత్యా బిర్లా గ్రూపు యజమాని కుమార మంగళం బిర్లా గురించి మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. వారం కిందట ఆయన కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించిన సమాచారం చదవి.. ఔరా అనుకున్నారు. అన్నేసి వందల కోట్లు పోసి ముంబయిలోని ఇంటిని కొనటం చూసి అవాక్కు అయిపోయారు.
డబ్బులున్న మారాజులు ఏమైనా చేస్తారంటూ గొప్పగా చెప్పుకున్నారు. అంత భారీ సొమ్ము పెట్టి కొన్న ‘‘జతియా హౌస్’’లో ఏముంటుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. ఇంతకంటే ఖరీదైన డీల్ ఇప్పట్లో సాధ్యం కాదన్న మాట వినిపించింది. అయితే.. సరిగ్గా వారం కూడా కాక ముందే.. కుమార మంగళం బిర్లా రికార్డును తిరగరాయటమే కాదు.. డీల్ విలువ తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.
ఎందుకంటే.. దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ డీల్ గా దీన్ని చెప్పొచ్చు. ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత సైరన్ పూనావాలా తాజాగా ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ముంబయిలోని అత్యంత డబ్బులున్న మారాజులు నివసించే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి సమీపంలోని ‘‘లింకన్ హౌస్’’ను ఆయన రూ.750కోట్లు పోసి మరీ సొంతం చేసుకున్నారు. ఇదే దేశంలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ వ్యవహారంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నారు.
రూ.750 కోట్ల విలువైన లింకన్ హౌస్ కథేంటంటే.. 2011 వరకు అమెరికా రాయబార కార్యాలయంగా ఉన్న ఈ భవనం ఆ మధ్యనే మరో విశాలమైన భవంతిలోకి మారింది. అప్పటి నుంచి దాన్ని అమ్మాలని అమెరికా భావించింది. అయితే.. అమెరికా పెట్టిన ధరను పెట్టి కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ భవనం ద్వారా కనీసం రూ.850 కోట్లు అయినా వస్తాయన్నది అమెరికా భావన. అయితే.. అంత పెద్ద మొత్తాన్ని పెట్టి కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
అయితే.. అమెరికా అనుకున్న రూ.850 కోట్లకు ఓ వంద కోట్లు తగ్గి.. రూ.750కోట్లకు సైరన్ ఆఫర్ చేయటం.. ఇంతకంటే మంచి బేరం తగలదని భావించిన అమెరికా.. వెంటనే ఈ డీల్ కు ఓకే చెప్పేసిందని చెబుతున్నారు. త్వరలో ఈ ఖరీదైన భవనంలోకి సైరన్ పూనావాలా గృహప్రవేశం చేయనున్నారని చెబుతున్నారు. ఇన్నేసి వందల కోట్లు పెట్టి కొన్న ఇంటికి ఎవరు మాత్రం ఊరికే ఉంచుతారు చెప్పండి.