కేసీఆర్ కు దెబ్బేస్తున్న కాంగ్రెస్ నేత కొత్త ఐడియా

Update: 2018-05-05 16:33 GMT
జాతీయ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు కోసం అంటూ గళం విప్ప‌డ‌మే కాకుండా ప్ర‌య‌త్నాలను కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందుకోసం ఇప్ప‌టికే ఆయ‌న‌ ప‌లు పార్టీల‌ను క‌లిశారు. కొన్ని పార్టీలు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌గా మ‌రికొన్ని పార్టీలు ఆచితూచి స్పందిస్తున్నాయి. తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ కేఈఆర్ ఫ్రంట్ ఎత్తుగ‌డ‌పై ఎదురుదాడి మొద‌లుపెట్టింది. ఆయ‌న్ను జాతీయ స్థాయిలో ప‌లుచ‌న చేసే ఎత్తుగ‌డ‌ను అమ‌ల్లో పెట్టింది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తీరుపై భ‌గ్గుమ‌న్నారు, ఆయ‌న ఫ్రంట్ ఎత్తుగ‌డ‌ల‌ను ఎద్దేవా చేశారు. కుక్కలు చింపిన విస్తరిలాగా తెలంగాణను మార్చివేసిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అని బ్రాంతి రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిప‌డ్డారు. కేసీఆర్ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదని, అసమర్థతకు కేసీఆర్ పరాకాష్ట అని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని వాటిని ప్ర‌శ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్ అణిచివేత పాలన కొనసాగిస్తున్నారని దాసోజు మండిప‌డ్డారు. బీజేపీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మరిపోయారని ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా డైరెక్షన్ మేరకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారని ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని దాసోజు శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. కేసీఆర్ వ్యవహార శైలిని ఎండగడుతూ ఫెడరల్ ఫ్రంట్ అంటూ కలిసిన నేతలందరికి లేఖలు రాశ‌మ‌ని దాసోజు శ్ర‌వ‌ణ్ వెల్ల‌డించారు. కేసీఆర్ ఇంకా ఏ నేతలను కలిసిన కేసీఆర్ అసమర్థత గురించి లేఖలు రాస్తామ‌ని ప్ర‌క‌టించారు.

కాగా, ఈ ఎపిసోడ్‌పై టీఆర్ ఎస్ నేత‌లు భిన్న‌మైన వాద‌న వినిపిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కేసీఆర్ క‌లిసింది యూపీఏ భాగ‌స్వామ్యప‌క్షాల‌ను - తాజా మాజీ భాగ‌స్యామ్య పార్టీల‌ను క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఆయా పార్టీలు ఎంత‌మేర‌కు కేసీఆర్ ఫ్రంట్‌తో క‌లిసి న‌డుస్తాయ‌నేది వేరే సంగ‌తి అయిన‌ప్ప‌టికీ...ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఈ కూట‌మికి చెక్ పెట్టాల‌నే యోచ‌న‌లో కాంగ్ర‌సె్ ఈ ఎత్తుగడ‌ను వేసిందంటున్నారు. తెలంగాణను అభివృది చేయలేక దృష్టి మళ్లించాలని ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ నాటకం ఆడుతున్నారని లేఖలో నేతలకు వివరించడం ఇందులో భాగ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

Tags:    

Similar News