డీఎస్ కుమారుడికి బీజేపీ ఎంపీ టికెట్ కన్ఫర్మ్?

Update: 2017-09-10 05:44 GMT
'జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి' అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి కలకలం రేపిన టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ తాజాగా మరో అడుగు వేశారు. శనివారం నాడు ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రామ్ మాధవ్, రాంలాల్ లతో సమావేశమయ్యారు. డీఎస్ కుటుంబం బీజేపీలో చేరడంపైనే ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

బీజేసీ నేతలతో అరవింద్ జరిపిన చర్చలు ఫలించాయని.. ఆయనకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని వినిపిస్తోంది. ఇదే నిజమైతే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె తన పాత స్థానం నిజామాబాద్ నుంచే పోటీ చేసే పక్షంలో ఆమెపై డీఎస్ కుమారుడు పోటీ చేసే పరిస్థితులు రానున్నాయన్నమాట.
    
మరోవైపు ఇప్పటికే డీఎస్ ప్రధాన అనుచరుల్లో ఓకరైన సంగారెడ్డి మాజీ డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. డీఎస్ కూడా బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ, ఆయన వాటిని ఖండించి, తాను టీఆర్ ఎస్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. తన కుమారుడి అభిప్రాయాలతో తనకు సంబంధం లేదని కూడా తేల్చి చెప్పారు.
    
అయితే... రాజకీయంగా ఆరితేరిపోయిన డీఎస్ వ్యూహాలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని.. అనుచరులను ముందుగా పంపించి.. ఆ తరువాత ఇప్పుడు కుటుంబ సభ్యులన బీజేపీలోకి పంపిస్తున్నారని.. చివరికి ఆయన కూడా చేరిపోతారని టీఆరెస్ పెద్దలు ఇప్పటికే అంచనాలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డీఎస్ కుటుంబం బీజేపీలో చేరితే నిజామాబాద్ లో బీజేపీ మరింత పట్టుపెంచుకోవడం ఖాయమని టీఆరెస్ కొంత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News