ఆ ఫ్యామిలీ తిన్నది అవు మాంసమేనట

Update: 2016-06-01 07:54 GMT
దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన దాద్రి ఘటనకు సంబంధించి ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. దేశంలో అసహనం అన్న అంశంపై తీవ్ర చర్చకు తావిచ్చిన ఈ ఘటన రాజకీయంగా మోడీ సర్కారు మీద ఎంత ప్రభావం చూపించిందో తెలిసిందే. యూపీలోని దాద్రి ప్రాంతంలో 50 ఏళ్ల మహ్మద్ అఖ్లక్ అనే వ్యక్తి ఇంట్లో ఆవు మాంసం ఉందంటూ వంద మంది అతని ఇంట్లోకి వెళ్లి అతన్ని లోపల నుంచి బయటకు లాగి.. దాడి చేయటం.. ఈ ఘటనలో అతను మరణించటం తెలిసిందే.

ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపటమే కాదు.. ఆవు మాంసం తినే విషయంలో ఎవరి వాదనను వారు వినిపించారు. ఒక వర్గం వారు అతి పవిత్రంగా పూజించే ఆవును చంపి తినటం ఏమిటన్నది ఒక ప్రశ్న. తినే విషయంలో నియంత్రణ ఏమిటంటూ మరో వర్గం వాదన. ఈ వాదనలు ఇలా ఉంటే. దాద్రి ఘటనలో బాధితుడు ఆవు మాంసం తినలేదని.. అతను తిన్నది మటన్ అంటూ పెద్ద ఎత్తున వాదనలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతం జరిగిన 8 నెలల తర్వాత అక్కడి మాంసపు శాంపిల్స్ ను పరీక్షించిన ఫోర్సెనిక్ నిపుణులు దాన్న ఆవు మాంసంగా తేల్చారు.

యూపీలో గో మాంసం తినటంపై నిషేధం లేకున్నా.. ఆవును చంపే విషయంలో మాత్రం బ్యాన్ ఉంది. అదక్కడ నేరం కూడా. తాజాగా దాద్రి ఉదంతంలో లభించింది ఆవు మాంసం అని తేలుస్తూ యూపీ డీజీపీ జావేద్ అహ్మద్ వెల్లడించటంతో ఇప్పుడీ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లైంది. 
Tags:    

Similar News