దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. పరిచయం అక్కర్లేని పేరు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడుగా ఉన్న ఆయన పలు పర్యాయాలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అంతేకాకుండా టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగానూ వ్యవహరించారు. తొలిసారిగా 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక అప్పటి నుంచి వైఎస్సార్సీపీలోనూ దగ్గుబాటి క్రియాశీలకంగా లేరు.
వాస్తవానికి దగ్గుబాటి కుమారుడు చెంచురామ్ ను పర్చూరు నుంచి పోటీ చేయించాలనుకున్నారు. అయితే ఆయనకు పౌరసత్వ సమస్యలు అడ్డుగా రావడంతో చివరి క్షణంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఓడిపోయాక మళ్లీ ఆయన ఎక్కడా వైసీపీ కార్యక్రమాల్లో కనిపించలేదు.
ఇటీవల టెన్నిస్ ఆడుతూ స్వల్ప గుండెపోటుకు గురికావడంతో ఆస్పత్రికి వెళ్లి దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించి వచ్చారు. చాలాసేపు అన్నదమ్ములిద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారని వార్తలు వచ్చాయి. పాత సంబంధాలు చిగురించాయని.. దగ్గుబాటి టీడీపీలో తిరిగి ప్రవేశానికి మార్గం సుగమమైందని గాసిప్స్ వినిపించాయి.
ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దగ్గుబాటి కుమారుడు హితేష్ చెంచురామ్ పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు టికెట్ ఖరారు చేశారని టీడీపీ వర్గాలు అప్పట్లో తెలిపాయి.
మరోవైపు 2019 ఎన్నికల ముందు వరకు పర్చూరు వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న రామనాథం బాబు టీడీపీలో చేరిపోయారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డిని పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమిస్తారని వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు.
ఎట్టకేలకు పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను నియమించారు.
ఇదిలా ఉండగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాజాగా సంచలన ప్రకటన చేశారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాను కానీ, తన కుమారుడు హితేష్ చెంచురామ్ రాజకీయాల్లో ఉండబోమని తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు చాలా మారిపోయాయని.. డబ్బుతోనే రాజకీయాలు నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో లేకపోయినప్పటికీ తాము ప్రజలకు అందుబాటులోనే ఉంటామన్నారు. ప్రజా సేవ కొనసాగిస్తామని తెలిపారు.
మరోవైపు ఇటీవల పర్చూరు వైసీపీ ఇన్‌చార్జిగా ఆమంచి కృష్ణమోహన్ ను వైసీపీ అధిష్టానం నియమించింది. కనీసం తనకు మాట కూడా చెప్పకుండా, తన అభిప్రాయం కూడా వినకుండా వైసీపీ అధిష్టానం పర్చూరు విషయంలో నిర్ణయం తీసుకోవడం దగ్గుబాటికి నచ్చలేదని టాక్ నడుస్తోంది.
మరోవైపు దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజంపేట నుంచి పురందేశ్వరి ఓడిపోయారు. 2004లో బాపట్ల నుంచి, 2009లో విశాఖ నుంచి పురందేశ్వరి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొంది కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు.