నవంబర్ 11 ఆదివారం 2018 దినఫలాలు

Update: 2018-11-11 01:30 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
    
మేషరాశి: వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.  మానసిక ఆందోళన, శారీరక రుగ్మతలు. నష్టాలొస్తాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. పారిశ్రామికవర్గాలకు నిరాశ. ఐటీ నిపుణులు కొంత గందరగోళానికి గురవుతారు. విద్యార్థులకు ప్రయత్నాలు ముందుకుసాగవు. మహిళలకు మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

వృషభరాశి: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం తగ్గుతుంది. అప్పులు ఎక్కువవుతాయి. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు విధులు. రాజకీయవర్గాలకు పదవులు చేజారుతాయి.  ఐటీ నిపుణులు శ్రమపడ్డా ఫలితం కనిపించదు. విద్యార్థుల అంచనాల్లో పొరపాట్లు. మహిళలకు మానసిక అశాంతి. సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మంచిది.

మిథునరాశి: గృహం వాహనాలు కొంటారు. ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు. నూతన కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారులకు లాభాలు తథ్యం.  ఉద్యోగాల్లో ప్రమోషన్లు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులు మరిన్ని విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు శుభవార్తలు. వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.  

కర్కాటకరాశి: అదనపు ఆదాయం చేకూరుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు సంతోషంగా గడుపుతారు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు. ఐటీ నిపుణులకు సమస్యలు తీరుతాయి. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగువేస్తారు. మహిళలకు ప్రశాంతత. విష్ణుసహస్ర నామా పారాయణం చేస్తే మంచిది.

సింహరాశి: ఆదాయం కంటే ఖర్చులు అధికం. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు కొద్దిపాటి సమస్యలు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణుల యత్నాలు ఫలించవు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు మానసిక ఆందోళన. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కన్యరాశి: ప్రతిభ ఉన్నా గుర్తింపు రాదు. ఆర్థిక విషయాలు నిరాశజనకం. రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి.  శారీరక రుగ్మతలు బాధిస్తాయి. కాంట్రాక్టులు అనుకూలించవు. వ్యాపారాలు నిరాశజనకం. ఉద్యోగాల్లో ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థుల యత్నాలు ఫలించవు. మహిళలకు సోదరులతో కలహాలు. గణేశాష్టకం పఠిస్తే మంచిది.

తులరాశి: రాబడి పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. వ్యాపారాభివృద్ధి. నూతన పెట్టుబడులు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. ఐటీ నిపుణులకు అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. విద్యార్థులకు యత్నాలు సఫలం. మహిళలకు ఆస్తిలాభం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: శారీరక రుగ్మతలు. కాంట్రాక్టర్ల కృషి ఫలించదు. వ్యాపారాలు నత్తనడక. ఉద్యోగాల్లో ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు చికాకులు. ఐటీ నిపుణులకు తొందరపాటు నిర్ణయాలు వద్దు. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు. మహిళలకు కుటుంబంలో చికాకులు. విష్ణు ధ్యానం చేస్తే మంచిది.

ధనుస్సురాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది.  ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుంచి సహాయం. వ్యాపారులకు అధిక లాభాలు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. పదవీయోగం. ఐటీ నిపుణులు విజయాల బాటలో పయనిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు శుభవార్తలు. దుర్గాదేవిని పూజిస్తే మంచిది.

మకరరాశి: ఆరోగ్య, కుటుంబ సమస్యలు. దూర ప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు బదిలీలు, పనిభారం. పారిశ్రామికవేత్తలకు పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు ఒత్తిడి. విద్యార్థులకు కొంత అసంతృప్తి. మహిళలకు మానసిక అశాంతి. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కుంభరాశి: వాహనాలు, స్థలాలు కొంటారు. రియల్టర్లు ఆస్తి విసయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి నిరుత్సాహం. ఐటీ నిపుణులు అవకాశాలు అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు భూలాభాలు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

మీనరాశి: వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. ప్రతిబను చాటుకుంటారు. రియల్టర్లు వ్యవహారాలు చక్కదిద్దుతారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులు ఉత్సాహవంతంగా గడుపుతారు.  మహిళలకు ఆస్తిలాభం. నవగ్రహస్తోత్రాలు పఠిస్తే మంచిది.
Tags:    

Similar News