ఫిబ్రవరి 2 శనివారం 2019 దినఫలాలు

Update: 2019-02-02 01:42 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
    
మేష రాశి : రియల్ ఎస్టేట్ ల వారికి గందరగోళం, వ్యాపారులు కొంత నిదానంతో సాగాలి, ఉద్యోగవర్గాలకు ఆకస్మిక బదిలీలు, పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు, ఐటి నిపుణులకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులు అనుకున్న పలితాలు రాక కలత చెందుతారు. మహిళలకు నిరుత్సాహం. షేర్ల విక్రయాలు సాదాసీదాగా ఉంటాయి.  విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది.

వృషభరాశి:  రియల్ ఎస్టేట్ లవారికి సమస్యలు. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. లాభాలు కష్టమే ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. విధులు కత్తి మీద సాముగా మారుతాయి. రాజకీయ పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు. అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. ఐటి నిపుణులకు కొన్ని ఇబ్బందులు. విద్యార్థులకు మానసిక అశాంతి. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

మిథునరాశి: రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు తొలుగుతాయి. వ్యాపారాలు మరింత విస్తారిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధించి పురోగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరమైన కాలం. ఐటి నిపుణులకు ఆహ్వనాలు అందుతాయి. విద్యార్థులు కొత్త విద్యావకాశాలు పొందుతారు
మహిళలకు సంతోషకరమైన సమాచారం. గణపతిని పూజిస్తే మంచిది.

కర్కాటకరాశి: రియల్ ఎస్టేట్ , కాంట్రాక్టర్లకు  ఉత్సాహం. వ్యాపారులు ఉత్సాహంగా  సాగుతాయి.  ఉద్యోగవర్గాలకు ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఐటీ నిపుణులకు కొంత అనుకూలత  ఉంటుంది. విద్యార్థులకు పరిశోధనల్లో విజయాలు వరిస్తాయి.  మహిళలకు నూతనోత్సాహం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

సింహరాశి: రియల్ ఎస్టేట్ వారికి యత్నాలు ఫలించవు. వ్యాపార లావాదేవీలు అంతగా లభించవు. ఉద్యోగులకు స్థానమార్పులు.  రాజకీయ పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలో మార్పులు
ఐటీ నిపుణులు కష్టానికి ఫలితం పొందలేరు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు మానసిక అశాంతి. విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తే మంచిది.

కన్య రాశి:  రియల్ ఎస్టేట్ ల వారికి కొత్త సమస్యలు. వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు చికాకులు పెరుగుతాయి. ఐటీ నిపుణులకు అరుదైన సన్మానాలు. విద్యార్థులకు ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు. సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మంచిది.

తులరాశి: రియల్ ఎస్టేట్ ల వారికి  భూలాభాలు. వ్యాపారాలలో ముదడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక , రాజకీయవేత్తలకు పనులు సాగుతాయి. ఐటీ నిపుణలుకు నూతనోత్సహం. విద్యార్థులకు  కొత్త అవకాశాలతో ముందుకు సాగుతారు. మహిళలకు మంచి అవకాశాలు. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

వృశ్చికరాశి:  రియల్ ఎస్టేట్ రంగం వారికి శ్రమ ఫలించదు. వ్యాపారులలో ఒడిదుడుకులు.  ఉద్యోగవర్గాలకు ఆకస్మిక మార్పులు. రాజకీయ వర్గాలకు కళారంగాల వారికి  అందిన అవకాశాలు సైతం  చేజార్చకుంటారు. ఐటి నిపుణలకు నిరుత్సాహం. విద్యార్ధులకు ఆశించిన ఫలితా లు రాక  డీలా పడతారు. మహిళలకు ఆరోగ్య భంగం. హనుమాన్ ను పూజిస్తే మంచిది.

ధనస్సు రాశి:  రియల్ ఎస్టేట్ ల వారికి అనుకూల సమాచారం.వ్యాపారులకు అధిక లాభాలు.  ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ కళారంగాల వారికి ఉహించని సన్మానాలు. ఐటీ నిపుణులకు పురస్కారాలు.  విద్యార్థులకు  పరిశోధనల్లో  గుర్తింపు లభిస్తుంది. మహిళలకు పురస్కారాలు దక్కుతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే మంచిది.

మకరరాశి: రియల్ ఎస్టేట్ల వారికి  శ్రమాధిక్యం. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. పారిశ్రామికులు, రాజకీయవర్గాలకు నిరాశా నిస్సృహలు. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థులకు కొంత సంయమనం  పాటించాలి. మహళలకు కుటుంబ సమస్యలు తప్సవు . నవగ్రహ విగ్రహా రాధన చేస్తే మంచిది.

కుంభరాశి: రియల్ ఎస్టేట్ వారికి  కోర్టు కేసులు.  వ్యాపార లావాదేవీల్లో ఉత్సాహం.  పెట్టుబడులు  సమకూరుతాయి  ఉద్యోగవర్గాలకు పదోన్నతులు.  రాజకీయ , కళారంగాల వారికి యోగదాయకం. ఐటీ నిపుణులకు  సమస్యలు తీరి కొంత ఉపశమనం  లభిస్తుంది. విద్యార్ధులకు ఒక ప్రకటన  ఆకట్టుకుంటుంది. మహిళలకు  ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. శివస్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనరాశి: రియల్ ఎస్టేట్ ల వారు అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారులు పుంజుకుంటాయి. కొత్త పెట్లుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చికాకులు. పారిశ్రామిక , రాజకీయవర్గాలకు విదేశి పర్యటనలు. ఐటి నిపుణలకు ఒక కీలకమైన విషయం ఉరటనిస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో గౌరవం. నృసింహస్వామిని పూజిస్తే మంచిది.
    

Tags:    

Similar News