డైరీలో నిజాలు..11 మంది చావుకు కారణాలివే..

Update: 2018-07-05 07:46 GMT
దేశ రాజధాని ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న 11 మంది మృతికి గల కారణాలు ఒక్కొటొక్కటిగా బయటకు వస్తున్నాయి. జూన్ 1న ఉదయం 7 గంటల 14 నిమిషాలకు పక్కింటి వారు వెళ్లి చూడగా 11 మంది విగజీవులై ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగుచూసింది. ముందు హత్యలుగా భావించిన పోలీసులు విచారణ జరపగా సామూహిక  ఆత్మహత్యలేనని తేలింది. మూఢనమ్మకాలే ప్రాణాలు తీశాయని సీసీ ఫుటేజీ - దొరికిన డైరీల ఆధారంగా పోలీసులు తేల్చారు. అయితే ఈ విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ ఆత్మహత్యలపై విచారణ జరిపిన పోలీసులు ఈ దారుణంలో బయట వ్యక్తుల ప్రేమయం లేనట్టుగా తేల్చారు. సీసీ ఫుటేజీలు - 11 ఏళ్లుగా రాసిన డైరీల ఆధారంగా వీరంతా మూఢనమ్మకాలతో ప్రాణాలు తీసుకున్నట్టు తేల్చారు.

సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. చుందావత్ ఇంటి ఎదురుగా ఉన్న ఒక మహిళ - ఆమె కుమార్తె - మరో ఇద్దరు పిల్లలు సామూహిక ఆత్మహత్య కోసం వైర్లు - స్టూళ్లు - తీసుకెళ్లడం కనిపించింది. లలిత్ చుందావత్ డైరీలో రాసినట్టే ఆత్మహత్య చేసుకున్నారు. మరణించిన తన తండ్రి  లలిత్ ను ఆవహించిందని రాసుకొచ్చారు... చనిపోతే మోక్షం లభిస్తుందని లలిత్  చెప్పడంతో వారంతా ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిసింది.

చనిపోయాక లలిత్ తండ్రి తమను కాపాడుతారని ఆ కుటుంబం భావించి ఆత్మహత్య చేసుకున్నారని డైరీలోని వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ‘కప్ లో నీళ్లు ఉంచండి.. రంగు మారిన సమయంలో నేను ప్రత్యక్షమై మిమ్మల్ని కాపాడుతాను.. పూజలు పూర్తయ్యాక ఒకరి కట్లు ఒకరు విప్పుకోవాలి’ అని రాసి ఉంది.

డైరీలో జూన్ 30న చివరిసారిగా రాసినట్టు ఉంది.. అందులో ‘దేవుని వద్దకు దారి అని రాసి ఉన్నట్టుగా పోలీసులు వివరించారు. గ్రిల్ దగ్గర 9మంది ఉరివేసుకోవాలని.. లలిత్ సోదరి - సోదరుడు భువనేష్ లు ఇంట్లో ఉన్న చిన్న మందిరం దగ్గర ఉరివేసుకోవాలని స్పష్టంగా డైరీలో రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డైరీలో ఏదైతేనే రాశారో దాన్ని అందరూ పాటించి తనువు చాలించారని పోలీసులు తెలిపారు.

ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయిన వారంతా.. రాత్రి 10 గంటల తర్వాత భోజనం ఆర్డర్ ఇచ్చారు. అందరికీ తల్లి నారాయణ దేవి భోజనం వడ్డించింది. ఆ తర్వాత ఖచ్చితంగా అర్ధరాత్రి 1 గంటకు ఉరివేసుకోవాలని డైరీలో రాసుకున్నారు. రాసి ఉన్నట్టుగానే 11 మంది ఒకేసారి జూలై1న అర్ధరాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వారి ముఖాలకు , కళ్లకు డాక్టర్ బ్యాండేజ్ గట్టిగా కట్టుకున్నారు.

ఇంటి ముందున్న సీసీ ఫుటేజీ - రాసుకున్న డైరీ ప్రకారం పలు కోణాల్లో విచారణ చేసిన పోలీసులు ఇవి సామూహిక ఆత్మహత్యలేనని నిర్ధారించారు. మూఢనమ్మకాలే వారి ప్రాణాలు తీశాయని తేల్చారు.
Tags:    

Similar News