ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలాకా అయిన గుజరాత్‌లో మరో కలకలం చోటుచేసుకుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో దళితుల విషయంలో పలు అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోగా తాజాగా మరో హేయనీయమైన ఘటన వెలుగు చూసింది. గుజరాత్‌లో దళిత యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అంతేకాకుండా చంపుతామని బెదిరించారు. ఇందుకు కారణం...తన కులం విషయంలో ఆయన అబద్దం చెప్పడమే!
గుజరాత్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం ప్రకారం వీడియోలోని బాధితుడు విఠలాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి. తాను అగ్ర కులానికి చెందిన వాడిగా ప్రచారం చేసుకున్నాడు. అయితే ఈ విషయం కొందరు అగ్రకులస్తులకు తెలిసి ఆయన్ను నిలదీశారు. ఇది అబద్ధం అని తేలటంతో చితకబాదారు. తను తప్పు చేశానని వేడుకుంటూ...కనికరించి వదిలేయాలని విజ్ఞప్తి చేసినా విడిచిపెట్టలేదు. ‘చంపుతాం’ అంటూ అతన్ని కిందపడేసి ఇష్టమొచ్చినట్లు తొక్కుతూ పిడిగుద్దులు గుప్పించారు. చివరాఖరికి కాళ్లు మొక్కి - క్షమాపణలు కోరటంతో వాళ్లు అతన్ని వదిలేశారు. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి వైరల్ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న దళిత సంఘాలు వారి తీరును ఖండించాయి. దీంతో కాగా బాధితుడు పోలీసులను ఆశ్రయించాడా? పోలీసులు కేసు నమోదు చేశారా? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి రాష్ట్రంలోనే ఇలాంటి అణిచివేత ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.