గుడ్ న్యూస్.. క‌రోనాకు ఆ మందు ప‌ని చేస్తోంది

Update: 2020-06-05 18:07 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం అంత‌కంత‌కూ పెరుగుతోంది త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. ఇంత‌కుముందు త‌క్కువ కేసుల‌కే జ‌నాలు విప‌రీతంగా భ‌య‌ప‌డ్డారు. కానీ ఇప్పుడు కేసులు అమాంతం పెరిగిపోయాయి. అయినా పెద్ద కంగారు ప‌డ‌ట్లేదు. ఒక ర‌కంగా చెప్పాలంటే క‌రోనాకు జ‌నం అల‌వాటు ప‌డిపోయార‌ని చెప్పొచ్చు. ఇండియాలో ఇప్పుడు క‌రోనా ప‌తాక స్థాయిని చూస్తున్నాం. ఏకంగా కేసులు 2 ల‌క్ష‌లు దాటిపోయాయి. క‌రోనా ఆరోగ్యాల్ని ఎంత దెబ్బ తీస్తుంది.. ఎన్ని ప్రాణాల్ని బ‌లిగొంటుంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. దాని ప్ర‌భావంతో అన్ని వ్య‌వ‌స్థ‌లూ కుదేల‌వుతున్నాయి. ఆర్థిక న‌ష్టం అపారంగా ఉంది. జ‌నాలు ఆదాయం, ఉపాధి కోల్పోతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనాకు వ్యాక్సిన్ వ‌చ్చి దాని తాలూకు భ‌యం పోతే త‌ప్ప ప్ర‌పంచం కుదురుకునేలా లేదు.

ఐతే క‌రోనాకు వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే రాద‌న్న‌ది స్ప‌ష్టం. ఈ ఏడాది అయితే అలాంటి ఆశ‌లేమీ పెట్టుకోవ‌ద్ద‌ని అంటున్నారు నిపుణులు. ఐతే కొన్ని ర‌కాల మందులు క‌రోనాకు బాగానే ప‌ని చేస్తుండ‌టం.. వైర‌స్ ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డంలో తోడ్ప‌డుతుండ‌టం ఊర‌ట‌నిచ్చే విష‌యం. ఆ మందుల‌న్నీ అలోప‌తివే. ఐతే ఆయుర్వేదంలోనూ ఇప్పుడు క‌రోనాకు ఓ ప్ర‌భావవంత‌మైన మందును కనుగొంది దాల్మియా హెల్త్ కేర్ సంస్థ‌. ఆ మందు పేరు.. ఆస్ట్రా-15. ఈ పాలీహెర్బల్‌ కాంబినేషన్‌ ఔషధం సామర్థ్యం, భద్రతను అంచనా వేయడానికి క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. కరోనా పేషెంట్లకు సహాయపడే అత్యంత సమర్థ ఆయుర్వేదిక్‌ సమ్మేళనం ఇద‌ని ఆ సంస్థ అంటోంది. ఈ ఔషధాన్ని ఇప్పటికే చెన్నైలోని ప్రత్యేక ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రోగులపై పరీక్షించి అధ్యయనం చేశారు. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కరోనా చికిత్సకు ఈ ఔషధం తోడ్పడిందని అధ్యయనంలో తేలినట్లు సంస్థ పేర్కొంది. ఇది క‌రోనా చికిత్స‌లో మంచి ముంద‌డుగుగా భావిస్తున్నారు.
Tags:    

Similar News