బీజేపీ గూటికి దానం...మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్లు!

Update: 2017-05-10 15:47 GMT
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మే నెల మూడో వారంలో తెలంగాణ‌లో చేప‌ట్టనున్న ప‌ర్య‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. వ‌ల‌స‌ల‌ను ప్రోత్సహించ‌డంతో పాటు కుల స‌మీక‌ర‌ణాల ద్వారా అధికారానికి ద‌గ్గ‌ర కావాల‌ని చూస్తోంది. తెలంగాణాలో కూడా నిర్ణయాత్మక శ‌క్తిగా ఎదిగేందుకు త‌మ ప్ర‌త్యేక ఎజెండా అయిన మ‌త స‌మీక‌ర‌ణాల‌తో పాటు కులాల వారీగా నేత‌ల‌పై సైతం గురిపెట్టింది. హిందు ఓటుబ్యాంకుతో పాటు.. బీసీలు, ద‌ళితుల‌ను త‌మ ద‌రికి చేర్చుకునే ప్రయ‌త్నాల్లో ఉంది. ఇప్పటికే ఎమ్మార్పీఎస్ నేత‌ మంద‌కృష్ణ మాదిగ‌ను ద‌గ్గర‌కు తీసుకున్న బీజేపీ త్వర‌లో బీసీ వ‌ర్గాల‌కు చెందిన బ‌ల‌మైన నేత‌ల‌ను పార్టీలోకి తీసుకునేందుకు సిద్దమ‌వుతోంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌ లోని బీసీ నేత‌ల‌కు గురి పెట్టిన‌ట్లు చెప్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ లేవనెత్తిన రిజ‌ర్వేషన్ల అంశ‌మే బీజేపీ ప్రధానంగా అందిపుచ్చుకుని మ‌త స‌మీక‌ర‌ణాలు మార్చాలని చూస్తోంది. అయితే ఈ ఒక్క బ‌ల‌మే స‌రిపోద‌ని భావించి కులాల వారీగా లక్ష్యం నిర్దేశించుకుంది. మోడీ ఫ్యాక్టర్‌తో పాటుగా కుల‌ - మ‌త స‌మీక‌ర‌ణాల‌తో కూడా ప‌నిచేస్తే తెలంగాణ‌లో అనుకున్న ల‌క్ష్యం చేరుకుంటామ‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌లోని బీసీ నేత‌ల‌కు గురిపెట్టిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప‌దేళ్ల కాలంలో  చ‌క్రం తిప్పిన హైదరాబాద్‌ కు చెందిన‌ బీసీ నాయ‌కులైన మాజీ మంత్రులు దానం నాగేంద‌ర్‌ - ముఖేష్ గౌడ్‌ - మాజీ ఎంపీ అంజ‌న్‌ కుమార్ యాద‌వ్ వంటి వారు బీజేపీ జాతీయ నాయ‌క‌త్వంతో ట‌చ్‌ లో ఉన్నట్టు ప్రచారం జ‌రుగుతోంది. బీజేపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్తగా మారిన‌ రాంమాధ‌వ్‌ కు తెలంగాణ బాధ్యత‌లు అప్పగించిన‌ట్టు కూడా ప్రచారముంది. నోవాటెల్ హోట‌ల్లో వారంతా ర‌హ‌స్యంగా రాంమాధ‌వ్‌ తో స‌మావేశం అయిన‌ట్టు చెప్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టిన ముస్లిం రిజ‌ర్వేష‌న్ అంశాన్ని ఆయుధంగా చేసుకుని బీజేపీ జ‌నాల్లోకి వెళ్లడానికి సర్వశ‌క్తులూ ఒడ్డింది. కేసీఆర్ లేవనెత్తిన రిజ‌ర్వేషన్ల అంశ‌మే బీజేపీ ప్రధానంగా అందిపుచ్చుకుని మ‌త స‌మీక‌ర‌ణాలు మార్చాలని చూస్తోంది.యూపీలో ఒక్క ముస్లింకు కూడా సీటు ఇవ్వకుండా అఖండ విజ‌యం సాధించింది. ఇక్కడ కూడా అదే పంథా అనుస‌రించే అవ‌కాశం లేకపోలేదని అంటున్నారు. మొత్తానికి బీజేపీ భారీ ప్రణాళిక‌తోనే వ‌స్తోందనేది ఖాయ‌మ‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News