క్రైమ్ లో సరికొత్త కోణాన్ని చూపించిన ‘దండుపాళ్యం’ సినిమా దాదాపు అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా చూసిన చాలా మంది వణికిపోయారు. మహిళలు ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేయడం.. అత్యాచారం చేయడం.. ఆ తర్వాత చంపేసి మొత్తం దోచుకుపోవడం. సినిమాలోని గ్యాంగ్ డ్యూటీ ఇదే. అచ్చం ఇదే మాదిరిగా హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో ఓ గ్యాంగ్ ఉంది. అయితే.. వీళ్లు టార్గెట్ చేసేది మహిళలనే కానీ.. హైవేల మీద మాటు వేస్తారు.
ఒంటరిగా వచ్చే ఆడవాళ్లకు లిఫ్ట్ ఇచ్చే పేరుతో బండి ఎక్కించుకుంటారు. వాళ్లు అంగీకరించకపోతే.. బలవంతంగా కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత హైవే పైనున్న పొదల్లోకి ఎత్తుకెళ్లి నలుగురూ అత్యాచారం చేస్తారు. ఆ తర్వాత కూడా వదిలేయరు. తమ గురించి పోలీసులకు చెబుతారేమోనని భావించి గొంతు కోసి చంపేస్తారు. వాళ్ల దగ్గర ఉన్న డబ్బులు, బంగారం వగైరా అన్నీ దోచుకుంటారు. ఆ తర్వాత ముఖం గుర్తు పట్టకుండా కత్తులు, రాళ్లతో చెక్కేస్తారు. అనంతరం మృతదేహాలను ఎక్కడికో తీసుకెళ్లి పడేస్తారు. ఇదీ.. వీరి క్రూర చరిత్ర.
తరచూ ఎక్కడో ఒక చోట ఇలా గుర్తు తెలియని శవాలు బయట పడుతున్నాయి. కానీ.. ఎవరిది అని గుర్తించడం మాత్రం పోలీసులకు అర్థం కావట్లేదు. నెలలు గడుస్తున్న కొద్దీ.. ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. కానీ.. దోషులు మాత్రం దొరకట్లేదు. దీంతో పోలీసు శాఖపై ఒత్తిడి పెరుగుతోంది. నేరస్తులు ఎలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? అనే వివరాలు ఏవీ తెలియదు. ఎక్కడ నేరం చేస్తారు.. ఎప్పుడు చేస్తారు? అనేది కూడా అర్థంకాకపోవడంతో.. పోలీసులకు అసలైన సవాల్ ఎదురైంది. ఆ ప్రాంతంలోని పోలీసు అధికారులు స్పెషల్ టీమ్ ను రంగంలోకి దించారు. వారు గాలింపు చేపట్టినా.. అంత ఈజీగా నిందితులు పట్టుబడలేదు.
పోలీసు టీమ్ మాత్రం తిరుగుతూనే ఉంది. అన్ని ప్రాంతాల్లో ప్రజలను అలర్ట్ చేస్తూ.. అనుమానితులు కనిపిస్తే.. సమాచారం ఇవ్వండని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒన్ ఫైన్ డే పోలీసులకు ఓ కాల్ వచ్చింది. నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పటిష్టమైన వ్యూహంతో హైవే పై మాటు వేసి నిందితులను పట్టేసుకున్నారు. అయితే.. స్టేషన్ కు తరలించిన తర్వాత వారిని విచారించే క్రమంలో చెప్పిన వివరాలు పోలీసులను నిర్ఘాంతపోయేలా చేశాయి.
ఈ నిందితులు ఏకంగా 2018 నుంచి ఈ తరహా నేరాలు చేస్తున్నారట. మొదటిసారి ఆ ఏడాది ఏప్రిల్ లో హైవేపై ఓ యువతికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి తీసుకెళ్ల, దారుణంగా అత్యాచారం చేసి, ఆ తర్వాత చంపేశారు. అనంతరం ముఖం మొత్తం చెక్కి మురుగు కాల్వలో పడేశారు. ఆ విషయం ఎప్పటికీ తేలకపోవడంతో.. నిందితులకు ధైర్యం వచ్చేసింది. ఇలాంటి నేరాలు ఎన్ని చేసినా.. ఏమీ కాదని భావించి, అమాయక ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, రేప్ చేసి చంపండం మొదలు పెట్టారు.
ఈ విధంగా ఇప్పటి వరకు పది మందికిపై చంపేశారట. ఈ విషయాలన్నీ విచారణ సందర్భంలో నిందితులు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. అందుకే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులను నమ్మొద్దని పోలీసులు చెబుతూనే ఉంటారు. తెలియని వారి విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఆడవాళ్లు ఇంకా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రమాదం ఎదురైన తర్వాత బాధపడేకంటే.. ముందే ఆచితూచి వ్యవహరించాలని పోలీసులు చెబుతున్నారు.