లాక్‌ డౌన్ : గోల్డ్ మెడ‌లిస్ట్ ని కూలీగా మార్చేసింది !

Update: 2020-06-27 08:10 GMT
దేశం లో వైరస్ మహమ్మారి విజృంభణ రోజు రోజుకి భారీగా పెరిగి పోతుంది.  దేశ వ్యాప్తంగా రోజు రోజుకి వైరస్ పాజిటివ్ కేసులు భారీ గా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బ కు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ముఖ్యం గా మహమ్మారి ని అరి కట్టడానికి లాక్ డౌన్ ను విధించడం తో ...దాదాపు గా ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడ్డారు. ఎంతోమంది ఉద్యోగాలు ఊడిపోయాయి.  

ఈ క్రమంలో కుంగ్ఫూ క్రీడ‌లో ప్రత్యర్థులను చిత్తుచేసి, బంగారు పతకాలు సాధించిన  ఓ  యువ‌కుడు ఇప్పుడు కూలి ప‌నుల‌కు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. జాతీయ క్రీడాకారుడైన ధ‌నుంజ‌య్ పొట్ట‌పోషించుకునేందుకు ఇళ్ల గోడ‌ల‌కు పుట్టీ ప‌నులు చేసేందుకు వెళుతున్నాడు. ఇత‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ  కుంగ్ఫూ లో తొమ్మిది బంగారు పతకాలు సాధించాడు. అయితే , వైరస్ లాక్ డౌన్ కారణంగా చాల మంది పరిస్థితి తలకిందులయింది.

గోల్డ్ మెడలిస్ట్ ధ‌నుంజ‌య్ కోచ్ సంజీవ్ శుక్లా ఆమ‌ధ్య‌ రెండు పాఠశాలల్లోని పిల్లలకు వుషు నేర్పడానికి అత‌నికి అవ‌కాశం క‌ల్పించారు. అయితే లాక్‌ డౌన్ కార‌ణంగా పాఠశాలలు మూత‌ప‌డ్డాయి. దీంతో ధ‌నంజ‌య్ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది. దీనితో  కూలి ప‌నుల‌కు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ధనంజయ్ కోచ్ సంజీవ్ శుక్లా మాట్లాడుతూ లాక్‌ డౌన్ కార‌ణంగా పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌టంతో కోచ్‌ లు ఉపాధి కోల్పోయార‌న్నారు. ప్ర‌భుత్వం ఇటువంటివారిని ఆదుకోవాల‌ని కోరారు.
Tags:    

Similar News