కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో అమెరికా ముందుందని.. అమెరికా తర్వాత భారత్ లో అత్యధికంగా టెస్టులు జరిగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పటివరకు 50 మిలియన్లకు పైగా టెస్టులు చేశామని.. ఆ తర్వాత భారత్ లో అత్యధికంగా 12 మిలియన్ టెస్టులు జరిగాయని తెలిపారు.
కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నామని ట్రంప్ అన్నారు. కరోనా బారినపడే అవకాశం ఎవరికి ఉందో ఓ అవగాహనకు వచ్చామన్నారు. కరోనాతో మరణించిన వారికి నివాళిగా త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చి ప్రాణాంతక వైరస్ ను ఓడిస్తామని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.
కరోనాపై ఎంతగా పోరాడినా కొన్ని చోట్ల పరిస్థితులు చేజారిపోతున్నాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.యువతలో చాలామందికి కరోనా వచ్చి వెళ్లినా వారు అనారోగ్యం బారిన పడలేదని.. వారికి కూడా ఈ విషయం తెలియదన్నారు. వారు ఎదుటివారిని కాపాడాలని ట్రంప్ సూచించారు. కరోనాతో మరణించే చిన్నారుల సంఖ్య తక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే విషయమన్నారు.
కరోనాపై ప్రతీ దశను.. చికిత్సను ప్రపంచదేశాలతో పంచుకుంటున్నామని.. సమష్టిగా మహమ్మారిని ఓడిస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. చైనా వైరస్ విషపూరితం.. హానికరమైందని ట్రంప్ ఈ సందర్భంగా విమర్శించారు. చైనా తప్పించుకొని ప్రపంచాన్ని మొత్తం వ్యాపింపచేసిందని మండిపడ్డారు. వ్యాక్సిన్ తెచ్చి ఈ వైరస్ ను అంతం చేస్తామన్నారు.