అమెరికాలో కరోనా కేసుల సంఖ్య కోటిని దాటింది. చైనాలోని వూహాన్నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి నెమ్మదిగా అన్ని దేశాలకు పాకింది. ఇటలీ, బ్రిటన్ దేశాల్లో వేగంగా పెరిగిన కరోనా కేసులు నెమ్మదిగా అమెరికాకు పాకాయి. అక్కడ ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ప్రారంభంలో అక్కడి ప్రభుత్వం కూడా కరోనాను లైట్‌గా తీసుకోవడంతో కేసుల సంఖ్య విపరీతంగా మారింది. ప్రస్తుతం కేసుల సంఖ్య కోటి చేరింది. ప్రపంచంలోని మరేదేశంలోనూ ఇన్ని కేసులు నమోదుకాలేదు.
గడచిన పది రోజుల్లోనే యూఎస్ లో పది లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. న్యూయార్క్ టైమ్స్ లెక్కల ప్రకారం.. గడచిన 24 గంటల లో అమెరికాలో 1.26 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,00,51,300కు చేరింది. గత ఏడు రోజులుగా రోజుకు సగటున లక్షకు పైగా కేసులు అమెరికాలో నమోదవుతుండటం గమనార్హం.
ఇక, కేసులు అధికంగా ఉన్నాయని భావిస్తున్న ఇండియా, ఫ్రాన్స్ లతో పోలిస్తే, 29 శాతం కేసులు అమెరికాలోనే కొత్తగా వస్తున్నాయి. యూఎస్ లో మహమ్మారికి గత 24 గంటల్లో 1,013 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో సంభవిస్తున్న ప్రతి 11 మరణాల్లో ఒకటి అమెరికాలోనే నమోదవుతోంది. ఇక రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, విస్కాన్సిస్, నెబ్రాస్కా, ఐయోవాల్లో కేసులు అధికంగా ఉండగా, ఇల్లినాయిస్ లోనూ మహమ్మారి విస్తరిస్తోంది. 10 శాతం కేసులు టెక్సాస్ లోనే వస్తుండటంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నవంబర్ తొలివారంలో 1.05 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. వీటిల్లో 6.22 శాతం నమూనాలు పాజిటివ్ గా తేలాయన్నారు. గతంలో 6.17 శాతంగా ఉన్న పాజిటివ్ రేటు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనాను అరికట్డడంలో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వచ్చాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన జో బైడెన్కూడా అమెరికాలో కేసులు పెరిగేందుకు కారణం డొనాల్డ్ ట్రంపేనని ఆరోపణలు చేశారు. అయితే త్వరలోనే అమెరికాలో అధికార మార్పిడి జరుగనుండటంతో కొత్త ప్రభుత్వం కేసులను ఎలా కంట్రోల్ చేస్తుందని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.