అమెరికాలో మరో వ్యాక్సిన్ కు ఓకే చెప్పారు

Update: 2020-12-19 05:02 GMT
ప్రపంచంలో మరే దేశాన్ని దెబ్బ తీయనంత దారుణంగా దెబ్బ తీసిన మహమ్మారికి చెక్ చెప్పేందుకు అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది. గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో ఒక విపత్తు కారణంగా అమెరికన్లు ఇంత భారీగా మరణించిన దాఖలాలు.. ప్రభావితమైనది లేదు. కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ను తెచ్చేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఈ మధ్యనే ఫైజర్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. తాజాగా మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగం కింద అనుమతి లభించినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

త్వరలోనే ఈ వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారు. మోడెర్నా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత దీనికి అనుమతి లభించింది. అయితే.. ఈ నిర్ణయాన్ని అమెరికా ఆహార..ఔషధ నియంత్రణ సంస్థ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. అప్పటి నుంచి మాత్రమే.. దీని పంపిణీ మొదలు కానుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఫైజర్ వ్యాక్సిన్ ను తోడుగా మోడెర్నాజత కావటంతో.. వ్యాక్సిన్ పంపిణీని పెద్ద ఎత్తున ప్రజలకు అందించటానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త సంవత్సరం నాటికి అమెరికాలో దాదాపు రెండు కోట్ల మందికి తొలి డోసును అందించే టార్గెట్ ను పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. మోడెర్నా వ్యాక్సిన్ సమర్థత 94.1 శాతంగా తేల్చారు. గతంలో మోడెర్నావ్యాక్సిన్ కుసంబంధించి వెల్లడించిన సమాచారంతో పోలిస్తే.. తాజాగా వెల్లడించిన సమాచారాన్నివిశ్లేషించిన అనంతరం ఎఫ్డీడీఏ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ ను ఎదుర్కోవటంలో మోడెర్నా వ్యాక్సిన్ మంచి ఫలితాల్ని సాధించినట్లు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజల పైనా ఇది సమర్థంగా పని చేస్తున్నట్లు చెబుతున్నారు.

65 ఏళ్లకు పైబడి వయసులో ఉన్న వారిలో ఈ వ్యాక్సిన్ 86.4 శాతం సమర్థత చూపిస్తే.. 18 నుంచి 65 ఏళ్లకు పైబడి వయసున్న వారిలో ఈ వ్యాక్సిన్ 95.6 శాతం ప్రభావవంతంగా చూపించినట్లుగా తేలినట్లు తెలుస్తోంది. ఇక.. ఫైజర్.. మోడెర్నా వ్యాక్సిన్లకు మధ్యనున్న వ్యత్యాసం ఏమిటన్న కోణంలోకి వెళితే.. ఫైజర్ వ్యాక్సిన్ మైనస్ 70 డిగ్రీల సెల్సియస్  వద్ద నిల్వ చేయాల్సిన పరిస్థితి. మోడెర్నాకు మాత్రం అలాంటి ఇబ్బంది లేదని.. సాధారణ రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రత వద్దే దీన్ని నిల్వ చేసే వీలుంది. దీంతో.. ఫైజర్ టీకాతో పోలిస్తే మోడెర్నా వ్యాక్సిన్ పంపిణీ మరింత సులువు అవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News