ప్రాణాలు తీసే అత్యంత భయంకరమైన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాస్క్ , శానిటైజర్ మన జీవితంలో భాగమైపోయాయి. వైరస్ బారిన పడకుండా ఉండటానికి మాస్క్ తప్పనిసరి చేశాయి అన్ని దేశాలు. కొన్ని దేశాలు మాస్కులు లేకుండా బయట తిరిగే వారికి జరిమానాలను కూడా వేస్తున్నాయి. మాస్కులు ధరించడం అనేది రోజువారీ జీవితంలో ఓ భాగమౌతుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా త్వరలోనే మాస్కుల రహిత దేశంగా ఆవిర్భవిస్తుందని ,ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాస్కులు లేకుండా స్వేచ్ఛగా తిరిగొచ్చని చెప్పారు.
అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని అన్నారు. అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మాస్కులు ధరించకుండా హాజరయ్యారు. డబుల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారు త్వరలోనే మాస్కులు లేకుండా తిరిగే రోజులు రాబోతున్నాయి అని అన్నారు. అమెరికా చరిత్రలో ఇదో సుదినంగా బిడెన్ అభివర్ణించారు. కంటికి కనిపించని వైరస్‌పై అమెరికన్లు సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తూ వచ్చిన యుద్ధం , అంతిమ దశకు చేరుకుందని చెప్పారు. అంతకుముందు, సీడీసీ కూడా ఇదే ప్రకటన చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు త్వరలోనే మాస్కులు లేకుండా తిరగడానికి అనుమతి ఇస్తామని తెలిపింది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను తాము రూపొందిస్తోన్నామని తెలిపింది. మస్సాచుసెట్స్, న్యూయార్క్, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, వర్జీనియాల్లో మాస్కులు లేకుండా తిరగడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయా రాష్ట్రాల గవర్నర్లు తెలిపారు.
తమ రాష్ట్రాల్లోని ప్రజలు 80 శాతానికి పైగా రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నారని వారు పేర్కొన్నారు. ఆరుబయట మాస్కులను ధరించాల్సిన అవసరం లేనప్పటికీ.. ఆడిటోరియాలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటి ఇండోర్ ప్రాంతాల్లో మాత్రం మరి కొన్ని రోజుల పాటు మాస్కులను ధరించాల్సి ఉంటుందని కొందరు చెప్తున్నారు. అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి వంద రోజుల నాటికి 200 మిలియన్ల మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందక్కడి అధికార యంత్రాంగం. ఇప్పటికే 170 మిలియన్ల మంది వరకు వ్యాక్సిన్ వేశారు.ఫైజర్, బయోఎన్ టెక్, మోడెర్నా వ్యాక్సిన్లను అక్కడ వినియోగిస్తోన్నారు. కరోనా బారిన పడి అమెరికాలో ఇఫ్పటిదాకా 5,98,540 మంది మరణించారు. 3,36,26,036 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.