అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కొత్త సమస్య ఎదురైంది. కొవిడ్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉన్న వ్యాక్సినేషన్ విషయంలో ఆయన అనూహ్యమైన ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. తొలి డోస్ ను విజయవంతంగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్న ఆయనకు.. ఇప్పుడో సమస్య తలనొప్పిగా మారింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పరుగులు పెట్టించిన ఆయన.. తాజాగా అమెరికన్లకు వచ్చిన కొత్త డౌట్లను తీర్చలేక కిందా మీదా పడుతున్నారు. మూడు నెలల క్రితం టీకా కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించిన ఆయన.. ఇప్పుడు టీకా వేయించటానికి ఆపసోపాలు పడుతున్నారు. ఇటీవల కాలంలో వైరల్ అయిన అపోహలే దీనికి కారణంగా చెబుతున్నారు.
తన మొదటి వంద రోజుల పాలనలో 100 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వటం లక్ష్యంగా పెట్టుకుున్నారు బైడెన్. అందుకు తగ్గట్లే భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నిచేపట్టారు. టీకా వేసుకున్న వారికి ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ప్రకటించారు. దీంతో.. 100రోజుల్లో పెట్టుకున్న టార్గెట్ 56 రోజుల్లోనే పూర్తైంది. దీంతో.. తాను అనుకున్న 100 రోజుల్లో 200 మిలియన్ల వ్యాక్సిన్లు వేయాలని తాజాగా తన లక్ష్యాన్ని సవరించుకున్నారు.
అనూహ్యంగా అమెరికన్లు ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవటానికి మొండికేస్తున్నారు. ఇప్పటికి మొదటి డోస్ వేసుకోని దాదాపు 30 శాతం మంది తమకు టీకా అక్కర్లేదంటున్నారు. మరోవైపు.. మొదటి డోస్ వేసుకున్న వారు.. రెండో డోస్ వేసుకునే విషయంలో ముందుకు రావటం లేదు. దీంతో.. ఆ మధ్య వరకు వాయు వేగంతో నడిచిన వ్యాక్సినేషన్ ఇప్పుడు నత్త నడకన నడుస్తోంది.
ఇంతకీ అమెరికన్లలో వ్యాప్తి చెందిన కొత్త అపోహ ఏమంటే.. వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతుందన్న పుకారు అమెరికాలో షికారు చేస్తోంది. ఈ అర్థం లేని పుకారును మెజార్టీ అమెరికన్లు నమ్ముతున్నారు. దీంతో వ్యాక్సిన్ వేసుకోవటానికి ముందుకు రావటం లేదు. దీంతో.. టీకా కార్యక్రమం మందగించింది. అయితే.. శాస్త్రవేత్తలు టీకా వేసుకుంటే లైంగిక సామర్థ్యం సన్నగిల్లుతుందన్న ప్రచారంలో అర్థం లేదని కొట్టి పారేస్తున్నారు. కానీ.. వారి మాటల్ని అమెరికన్లు విశ్వసించటం లేదు. దీంతో బైడెన్ సర్కారుకు కొత్త తలనొప్పిగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో బైడెన్ పెట్టుకున్న లక్ష్యాన్ని సవరించుకోవాలని.. ప్రజల్లో ప్రబలిన అసత్య ప్రచారాన్ని నమ్మకూడదన్న ప్రచారాన్ని షురూ చేయాలని చెబుతున్నారు.